Breaking News

అకారణ ‘వెయిటింగ్‌’ అధికార దుర్వినియోగమే

Published on Wed, 05/07/2025 - 06:12

సాక్షి, అమరావతి: ప్రభుత్వ అధికారులకు అకారణంగా పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచడం అధికార దుర్వినియోగమేనని రాజస్థాన్‌ హైకోర్టు తేల్చి చెప్పింది. అధికారులకు పోస్టింగులు ఇవ్వడంలో జవాబుదారీతనం ఉండాలని స్పష్టం చేసింది. ఎవరికైనా సరే పోస్టింగ్‌ ఇవ్వకపోతే అందుకు కారణాలను వారికి లిఖిత పూర్వకంగా తెలపాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

నిర్దిష్ట కారణం లేకుండా ఏ అధికారికీ పోస్టింగు ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచడానికి వీల్లేదని విస్పష్టంగా ప్రకటించింది. అధికారులకు ఎటువంటి పరిస్థితుల్లో పోస్టింగ్‌ ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచవచ్చో నిర్దిష్ట మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు రాజస్థాన్‌ హైకోర్టు జోధ్‌పూర్‌ బెంచ్‌ చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులతోపాటు వందలాది మంది అధికారులకు 11 నెలలుగా పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ హైకోర్టు తీర్పు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. పరిపాలన కారణాలతోనే వెయిటింగ్‌లో ఉంచాలి తప్ప.. అదేదో శిక్షగానో కక్ష పూరితంగానో ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. 

ఆ తీర్పులోని ప్రధాన అంశాలు 
ూ వెయిటింగ్‌లో ఉంచడానికి కారణాలను లిఖిత పూర్వకంగా తెలపాలి
ూ ఒక అధికారిని దీర్ఘకాలంగా పోస్టింగు ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచడం అధికార దుర్వినియోగమే అవుతుంది. 30 రోజులకు మించి ఎవరికీ పోస్టింగు ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచకూడదు. అంతకు మించి వెయిటింగ్‌లో ఉంచాల్సి వస్తే సహేతుక కారణాలతో ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. 
ూ అధికారులు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లి తిరిగి వచ్చి జాయిన్‌ అయినప్పుడు, ఒక శాఖ నుంచి మరో శాఖకు డెప్యుటేషన్‌పై వెళ్లి.. ఆ డెప్యుటేషన్‌ కాలపరిమితి ముగియడంతో మాతృ శాఖకు తిరిగి వచ్చినప్పుడు, ఉద్యోగపరమైన శిక్షణకు హాజరై తిరిగి వచ్చిన తర్వాత, అధికారి తనకు ఇచ్చిన పోస్టులో చేరకుండా ఉన్నప్పుడు, తనను బదిలీ చేసిన పోస్టులో చేరకుండా ఉన్నప్పుడు, అధికారి బదిలీని ఉపసంహరించినప్పుడు వెయిటింగ్‌లో ఉంచవచ్చని మార్గదర్శకాలు జారీ చేసింది.

ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ తీరు 
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తోంది. 2024 జూన్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎటువంటి కారణాలను పేర్కొనకుండానే ఏకంగా ఐదుగురు ఐఏఎస్, 13 మంది ఐపీఎస్‌ అధికారులతోపాటు అదనపు ఎస్పీల నుంచి సీఐల వరకు మరో 300 మందికి పోస్టింగులు ఇవ్వకుండా ఎన్నో నెలలపాటు వెయిటింగ్‌లో ఉంచింది. దాదాపు ఏడాది కావస్తున్నా ఇప్పటికీ ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు, ఇద్దరు ఐపీఎస్‌ అధికారులతోపాటు అదనపు ఎస్పీ స్థాయి నుంచి సీఐ స్థాయి అధికారుల వరకు 191 మందికి పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగ్‌లోనే ఉంచింది.

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)