Breaking News

రాజమండ్రి జైలు సూపరింటెండెంట్‌ భార్య మృతి

Published on Sat, 09/16/2023 - 08:00

సాక్షి, తూర్పుగోదావరి:  రాజమండ్రి సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ భార్య ఎస్‌ రాహుల్‌ భార్య కిరణ్మయి(46) మృతిచెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్మయి ఆసుపత్రిలో చికిత్స  పొందుతూ  శుక్రవారం రాత్రి కన్నుమూశారు. మృతదేహాన్ని అంబులెన్సులో గుంటూరు తీసుకెళ్లారు.

జైళ్ల శాఖ డీఐజీ ఎంఆర్‌ రవికిరణ్‌, ఎస్పీ జగదీశ్‌ ఆస్పత్రికి వెళ్లి సంతాపం తెలిపారు. భార్య అనారోగ్యం కారణంతో జైలు సూపరింటెండెంట్‌ రాహుల్‌ సెలవులపై వెళ్లారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న నేపథ్యంలో ఒత్తిడిపై రాహుల్‌ సెలవులపై వెళ్లారని పలువురు దుష్ప్రచారం చేశారు.

ఈ క్రమంలో ఎస్పీ జగదీష్‌ స్పందిస్తూ ఆ వార్తలను కొట్టిపారేశారు. భార్య అనారోగ్యం కారణంగానే ఆయన సెలవుపై వెళ్లారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన అవాస్తవ కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై ఒత్తిళ్లు లేవని,  తమ డ్యూటీ తాము చేస్తున్నానమని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా భార్య మరణం దృష్ట్యా సూపరింటెండెంట్‌ రాహుల్‌ సెలవును పొడిగిస్తున్నట్లు జైళ్ల శాఖ డీఐజీ ఎంఆర్‌ రవికిరణ్‌ తెలిపారు. ఆయన తిరిగి విధుల్లో చేరే వరకూ కేంద్ర కారాగార పర్యవేక్షణ బాధ్యతలు తానే నిర్వర్తిస్తానని చెప్పారు.
చదవండి: Live Updates: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)