Breaking News

పెరూ పుంజు.. వచ్చెనండి.. కాసులు తెచ్చెనండీ! 

Published on Tue, 08/01/2023 - 03:50

కోనసీమలో ఒక కొబ్బరి చెట్టునో, ఒక గేదెనో.. ఒక ఎకరం భూమినో నమ్ముకుని ఆదాయం పొందుతూ ఏదోలా బతికేద్దామని అనుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. కానీ తాను అలా అనుకోలేదంటున్నారు పెన్మెత్స రామ సత్యనారాయణరాజు అలియాస్‌ ఈస్ట్‌ గోదావరి రామరాజు. నేడు భూములు, పశువులు, కొబ్బరి చెట్ల వల్ల ఆదాయం అంతగా లభించక కొంతమంది ఉన్నత చదువులతో ఉన్నత రంగాలకు వెళ్లిపోతున్నారు. కానీ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలం బట్టేలంక గ్రామానికి చెందిన ఈ యువకుడు కేవలం ఒక కోడిపుంజును నమ్ముకున్నాడు, తద్వారా దండిగా ఆదాయం సంపాదిస్తున్నాడు.   – మలికిపురం

ఈస్ట్‌ గోదావరి రామరాజు (32) బీటెక్‌ పూర్తి చేశారు. తండ్రి వేంకటేశ్వరరాజు రెండేళ్ల క్రితం కరోనాతో మృతి చెందడంతో అప్పటి నుంచి కుటుంబం కోసం ఉద్యోగం ఆలోచన విరమించుకుని రామరాజు బట్టేలంకలోనే ఉంటున్నారు. ఈయనకు ఇదే మండలం ఇరుసుమండ గ్రామంలో 15 ఎకరాల కొబ్బరి తోట ఉంది. అదీ ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి పంచుకోగా వచ్చింది. దీని ద్వారా వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. దీంతో కోనసీమలో పలువురు చేస్తోన్న మాదిరిగానే రామరాజు దేశవాళీ కోడిపుంజులు పెంచుతూ సంక్రాంతి సమయంలో అమ్ముతు ఉంటారు. ఇందులోనూ అంతంత మాత్రంగానే ఆదాయం వస్తుండటంతో ఆయన సరికొత్త ఆలోచన చేశారు. 

పుంజుకూ వీసా..!
అమెరికాలో పరిచయమున్న వారి ద్వారా రామరాజు ‘పెరూ’ జాతి కోడిపుంజును అక్కడి ధర రూ.1.40 లక్షలకు 2020 జూన్‌లో కొనుగోలు చేశారు. పెరూ నుంచి దిగుమతి చేసుకున్న కోడి పుంజులకు ప్రత్యేకంగా వీసా ఖర్చులతో పాటు విమానంలో ప్రయాణానికి అదనంగా టికెట్‌ను కొనుగోలు చేసి ఆ కోడిపుంజును అమెరికా నుంచి హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా తయారైన కారులో ఇరుసుమండలోని రామరాజు కొబ్బరి తోటలోకి పుంజు చేరింది. ఈ పుంజును అన్నీ కలుపుకొని ఇక్కడకు తీసుకురావడానికి రామరాజుకు రూ.2.85 లక్షలు ఖర్చయ్యింది.

అప్పటి నుంచీ ఈ పెరూ జాతి కోడిపుంజును రాజభోగాలతో రామరాజు మేపుతున్నారు. మేలు రకాలయిన దేశవాళీ పెట్టల క్రాసింగ్‌ ద్వారా దీని సంతానం విపరీతంగా పెరిగింది. ఈ జాతి పుంజులు పందాల్లో విశేష ప్రతిభ చూపడంతో దీని బ్రీడ్‌కు డిమాండ్‌ పెరిగింది. రామరాజు కోడిపుంజులను పెంచడం లేదు. వీటి పిల్లలను 3 నెలల వయసు వచ్చే వరకు మాత్రమే పెంచి అనంతరం ఒక్కో పిల్లను రూ.10,000కు పైగా విక్రయిస్తున్నారు. ఇలా ఈ రెండేళ్లలో ఇప్పటివరకు రూ.41.60 లక్షల ఆదాయం వచ్చినట్లు రామరాజు చెప్పారు. దీనిలో నెలకు రూ.25 వేల చొప్పున ఖర్చవుతుందని, రూ.35.60 లక్షలు మిగిలిందని వెల్లడించారు.

దండిగా ఆదాయం
ప్రస్తుతం కొబ్బరి ఆదాయం తోటల నిర్వహణకే సరిపోతోంది. దీంతో ఇలా ప్రయోగం చేసి ఈ కోడిపుంజును దింపాను. రెండేళ్లలో రూ.41.60 లక్షల షేర్‌ వచ్చింది. నిర్వహణ ఖర్చు నెలకు రూ.25 వేలకు పైగా ఉంటుంది. ఏడాదికి రూ.10 లక్షలు పైగా మిగులుతుంది. – పెన్మెత్స రామ సత్యనారాయణ రాజు, బట్టేలంక 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)