Fact Check: ఎక్స్చేంజీల్లో చెప్పిన ధరకే విద్యుత్‌ కొనుగోలు

Published on Thu, 09/07/2023 - 05:23

సాక్షి, అమరావతి: జాతీయ ఎనర్జీ ఎక్స్చేంజీల్లో విద్యుత్‌ ధరలను ఎవరూ నియంత్రించలేరు. కేవ­లం గరిష్ట సీలింగ్‌ ధరను మాత్రమే నిర్ణయించగ­లరు. ఆ అధికారం కూడా కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (సీఈఆర్‌సీ)కే ఉంది. ఇంత చిన్న విషయంపైన కూడా అవగాహన లేకనో లేదా ఉద్దేశ­పూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వంపైన, సీఎం వైఎస్‌ జగన్‌ పైనా బురద జల్లాలనే అత్యుత్సాహమో ఈనాడు బుధవారం ఓ తప్పుడు కథనాన్ని అచ్చేసింది. ‘మనం చేస్తే ఖర్చు.. మరొక­రైతే దోపిడీ’ అంటూ అవాస్తవాలను అల్లింది.

ప్రజల అవసరాలకు రాష్ట్రంలో ఉన్న విద్యుత్‌ సరిపో­నప్పుడు బహిరంగ మార్కెట్‌లో కొనైనా ఇబ్బంది లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడమే తప్పన్నట్టుగా ఆ కథనంలో అక్కసు వెళ్లగక్కింది. విద్యు­త్‌ను బయట నుంచి మూడు రెట్లు అధిక ధరకు కొంటున్నారని, ఆ భారం ప్రజలపైనే వేస్తారని లేనిపోని అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించింది. దీనిపై ఇంధన శాఖ వెల్లడించిన వాస్తవాలు ఇలా ఉన్నాయి. 


► దేశంలో  విద్యుత్‌ ఎక్స్చేంజిలు కొత్తగా ఏమీ రాలేదు. 2008–09 ఆర్థిక సంవత్సరం నుంచి ఉన్నాయి. అప్పటి నుంచి వివిధ రకాల మార్కెట్‌ సెగ్మెంట్ల  ద్వారా స్వల్పకాలిక విద్యుత్‌ కొనుగోళ్లు జరుగుతున్నాయి. రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు  స్వల్పకాలిక  విద్యుత్‌ అవసరాల కోసం ఎప్పటి నుండో  ఈ ఎక్స్చేంజిలపై ఆధారపడ్డాయి.

► మార్కెట్‌ ధరలు ఆ రోజుకి, ఆ టైం బ్లాక్‌ (ఒక రోజులో  96 టైం బ్లాక్‌ లు ఉంటాయి. ఒక్కోటీ 15 నిమిషాల సమయం)లో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న విద్యుత్, డిమాండ్‌ బిడ్లు ఆధారంగా ఉంటాయి. 

► ఇందులో బయటి నుంచి ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉండదు. ఈ ఎక్స్చేంజిలు కేంద్ర విద్యుత్‌  నియంత్రణ మండలి ఆదేశాల ప్రకారం, మండలి నిబంధనలు, నియమావళికి లోబడి పనిచేస్తాయి.

► నెల వారీగా కొనే ద్వైపాక్షిక  విద్యుత్‌ ఒప్పందాలైతే  డీఈఈపీ, ఈ–బిడ్డింగ్‌ పోర్టల్‌  ద్వారా నిర్దేశిస్తారు. ఈ పోర్టల్‌  కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తుంది. కేంద్ర విద్యుత్‌ శాఖ ఎక్స్చేంజిల్లో కొనే విద్యుత్‌కు గరిష్ట ధర (సీలింగ్‌ ప్రైస్‌) యూనిట్‌ రూ.10గా కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి నిర్ధారించింది.

► పీక్‌ లోడ్‌ సమయం ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా వివిధ కేటగిరీల లోడ్‌ను బట్టి, అందుబాటులో ఉండే ఉత్పత్తి వనరులపై  ఆధారపడి ఉంటుంది. అంతే కానీ ఈ ధరలను ఎవరూ  నియంత్రించలేరు.

► పీక్‌ అవర్స్‌లో విద్యుత్‌ కొనుగోలు కూడా ఇంధన, విద్యుత్‌ కొనుగోలు వ్యయ సర్దుబాటు చార్జీల  రూపంలో వసూలు చేసుకోవడానికి డిస్కంలకు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) అనుమతి ఇచ్చింది. దాని ప్రకారమే చార్జీలు వసూలు చేస్తున్నారు.

► మార్కెట్‌  ధరలు మూడు రెట్లు పెరగలేదు. గతంలో సీలింగ్‌ ధర యూనిట్‌కు రూ. 20 ఉండేది. అప్పుడు కూడా అత్యవసరాన్ని బట్టి డిస్కంలు యూనిట్‌కు రూ. 17 వరకు వెచ్చించి కొన్నాయి.  ఈ ఏడాది అనూహ్యంగా పెరిగిన డిమాండ్‌ వల్ల, జల విద్యుత్‌ లేకపోవడం వల్ల మార్కెట్‌లో ధరలు పీక్‌ సమయంలో దాదాపు సీలింగ్‌ ప్రైస్‌ యూనిట్‌ రూ .10, రోజువారీ ధర రూ.6 నుంచి రూ.9 వరకు సీఈఆర్‌సీ నిర్ణయించింది. అంతేగానీ ధరలు మూడు రెట్లు పెరగలేదు. 

► మార్కెట్‌ కొనుగోళ్లలో ఏ విధమైన ప్రమేయాలూ ఉండవు. ధరలు మార్కెట్‌ అంశాల ఆధారంగానే నిర్ధారణ చేస్తారు.

► దేశంలోనే  అతి పెద్ద విద్యుత్‌ ఎక్స్చేంజి ఐఈఎక్స్‌ గణాంకాల  ప్రకారం.. సంవత్సరం అంతా సాయంత్రం పీక్‌ లోడ్‌ సరాసరి ధరలు (అన్ని నెలలు, సీజన్లు  కలుపుకుని) గత 8 సంవత్సరాలుగా ఈ విధంగా ఉన్నాయి. 

Videos

ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు..

నో డౌట్ పక్కా సీఎం జగన్

వైఎస్ఆర్ సీపీ గెలుపు ధీమా..

ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు..

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు పేరుతో ఘరానా మోసం

జగన్ సీఎం కాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు..

హిమాచల్‌ ప్రదేశ్ లో అత్యధిక ఓటింగ్ శాతం

ముగిసిన ప్రధాని మోదీ ధ్యానం

మళ్లీ YSRCPదే.. డా. మునిబాబు గ్రౌండ్ రిపోర్ట్

ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన.. గన్నవరంలో ఘన స్వాగతం

Photos

+5

రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్‌ చహర్‌ భావోద్వేగం (ఫొటోలు)

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

భర్తతో కలిసి క్రొయేషియా ట్రిప్‌లో బిజీగా బ్యాడ్మింటన్‌ స్టార్‌.. స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫొటోలు)

+5

టీ20 వరల్డ్‌కప్‌-2024: భర్త క్రికెట్‌తో.. భార్య యాంకరింగ్‌తో బిజీ.. క్యూట్‌ కపుల్‌(ఫొటోలు)

+5

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అంటూ కామెంట్స్‌.. నా భర్త అడిగేవాడన్న హీరోయిన్!(ఫొటోలు)

+5

ఈ స్టన్నింగ్‌ బ్యూటీ.. టీమిండియా స్టార్‌ భార్య! గుర్తుపట్టారా? (ఫొటోలు)