Breaking News

రూ.కోటి ఇస్తా.. వీసీ పోస్టు నాదే!

Published on Thu, 10/16/2025 - 06:01

సాక్షి, అమరావతి: ‘రూ.కోటి ఇస్తా.. వీసీ పోస్టు నాదే.. నన్ను కాదని వీసీగా ఎవరొస్తారు.. సెర్చ్‌ కమిటీ ఎవరి పేరు సిఫారసు చేసినా నేనే వీసీ.. అవసరమైతే వీసీగా పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) ఆర్డర్‌ తెచ్చుకుంటా’ అని ముఖ్య నేత ఇలాకాలోని ఓ వర్సిటీ ఇన్‌చార్జి వీసీ బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు పూర్తి స్థాయిలో వైస్‌ చాన్సలర్లను నియమించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. 16 నెలలుగా వర్సిటీల్లో పాలన గాడి తప్పడంతో విద్యా వ్యవస్థ కుదేలవుతోంది. 

ఇంకా నాలుగు వర్సిటీలకు వీసీలను నియమించడంలో పిల్లి మొగ్గలు వేస్తోంది.ప్రభుత్వం వీసీల నియా­మకానికి వర్సిటీలకు విడివిడిగా యూజీసీ, వర్సిటీ, రాష్ట్ర ప్రతినిధులుగా ముగ్గురు సభ్యులతో సెర్చ్‌ కమిటీ నియమిస్తుంది. సెర్చ్‌ కమిటీ వీసీ పోస్టు కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వానికి మూడు పేర్లు ప్రతిపాదిస్తుంది. అందులో ఒకరిని గవర్నర్‌ ఆమోదంతో ప్రభుత్వం వీసీగా నియమిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్య నేత ఇలాకాలోని వర్సిటీ ఇన్‌చార్జి వీసీ మాత్రం సెర్చ్‌ కమిటీతో సంబంధం లేకుండా వీసీ పోస్టు కోసం మంత్రాంగం నెరుపుతుండటం తీవ్ర చర్చనీయాంశమైంది. 

వాస్తవానికి వర్సిటీకి సెర్చ్‌ కమిటీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక ప్రొఫెసర్‌ పేరును సిఫారసు చేసినట్లు సమాచారం. అయితే ఎలాగైనా సెర్చ్‌ కమిటీ నివేదికను పక్కకు తప్పించి, పూర్తి అదనపు బాధ్యత (ఎఫ్‌ఏసీ) ఆర్డర్‌ తెచ్చుకుని వీసీగా కొనసాగాలని ఆ ఇన్‌చార్జ్‌ వీసీ భావిస్తున్నట్టు తెలిసింది. అందుకే ఆయన వర్సిటీలో కంటే అమరావతిలోనే ఎక్కు­వ­గా ఉంటున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   

సొంత సామాజిక వర్గానికి కొమ్ము కాస్తారా? 
ముఖ్య నేత ఇలాకాలోని వర్సిటీలో అర్హత లేనప్పటికీ సొంత సామాజిక వర్గం కార్డును అడ్డు పెట్టుకుని ఆయన ఇన్‌చార్జి వీసీగా చెలామణి అవుతున్నారని ఇప్పటికే పలు విమర్శలు ఉన్నాయి. దీనికితోడు ఆయనకు ఆచార్యునిగా పదోన్నతిపై కోర్టులో కేసులు ఉండటం గమనార్హం. వాస్తవానికి బోధనేతర విభాగానికి చెందిన వ్యక్తికి ఆచార్యుడిగా ప్రమోషన్‌ ఇవ్వడమే వర్సిటీ నిబంధనలకు విరుద్ధం అనుకుంటే కూటమి ప్రభుత్వం ఆయన్ను ఏకంగా ఇన్‌చార్జి వీసీని చేసింది. 

ఇప్పుడు ఆయన్ని ఏకంగా వీసీగా (ఎఫ్‌ఏసీ) ఎక్కడ నియమిస్తారోనని వర్సిటీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సదరు ఇన్‌చార్జి వీసీ 16 నెలల్లో వర్సిటీ ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా అమ్మేశారని విమర్శలు మూటగట్టుకున్నారు. దశాబ్దాల నాటి చెట్లను తెగనరికి అడ్డంగా దోపిడీకి పాల్పడటంపై సీఎంవో వరకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనికి తోడు స్క్రాప్‌ పేరుతో కంప్యూటర్లు, టేబుళ్లను కారు చౌకగా ఇచ్చేసి భారీగా ముడుపులు దండుకున్నారని వర్సిటీ వర్గాలే విమర్శిస్తున్నాయి.    

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)