Breaking News

AP: ‘సాక్షి’పై దాడులు.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన

Published on Tue, 06/10/2025 - 10:21

ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచకాలు పతాకస్థాయికి చేరాయి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే పత్రికా స్వేచ్ఛకూ సంకెళ్లు వేస్తున్నారు. నిజాలు రాసే కలాలను, వాస్తవాలు చెప్పే గళాలను నిరంకుశంగా అణగదొక్కుతున్నారు.ఈ క్రమంలోనే.. ఎవరో చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపించి ‘సాక్షి’పై దాడులకు ఉసిగొలిపింది.

తెలుగువారి మనస్సాక్షిగా.. పేదవాడి గొంతుకై.. నాణేనికి రెండోవైపు ప్రజల పక్షాన నిలబడుతూ, వాస్తవాలను ప్రచురిస్తూ.. ప్రసారం చేస్తున్న ‘సాక్షి’పై రాజకీయ కుట్రలకు బరితెగిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ ప్రోద్బలంతో కూటమి నేతలు, అల్లరిమూకలు కలిసి సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’ కార్యాలయాలపై మూకుమ్మడి దాడులకు తెగబడ్డారు.  ఈ దాడులపై రాష్ట్ర  వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

మీడియాపై అధికార పార్టీ దౌర్జన్యం తగదు 
శ్రీకాకుళం: అమరావతిపై ఇటీవల సాక్షి టీవీ చానల్‌లో జరిగిన చర్చలో దొర్లిన కొన్ని వ్యాఖ్యలపై నిరసనల పేరుతో అధికారపార్టీ దౌర్జన్యాలకు దిగడం దారుణమని, మీడియా కార్యాలయాలను ధ్వంసం చేయడం సరైన విధానం కాదని సామ్నా రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు ఖండి­ంచారు. మీడియాపై దాడి అప్రజాస్వామిక­మని పేర్కొన్నారు. దాడి ఘటనలను ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్‌.­ఈశ్వరరావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సీహెచ్‌ జగదీ‹Ù, సనపల రమేష్‌ ఖండించారు.

ప్రభుత్వ తప్పిదాలను ‘సాక్షి’ ప్రశ్నిస్తుందనే అక్కసుతోనే..

  • ఏపీలో సాక్షి’ కార్యాలయాలపై అకారణంగా టీడీపీ గూండాలు దాడులపై రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి సిబ్బంది నిరసన

  • సోమవారం కొవ్వొత్తుల ప్రదర్శనతో టీడీపీ దాడులపై మండిపాటు

  • ప్రభుత్వ తప్పిదాలను ‘సాక్షి’ ప్రశ్నిస్తుందనే అక్కసుతోనే దాడులు

  • ఇవి కుట్రపూరిత, కక్ష పూరిత దాడులంటూ ధ్వజం

పత్రికా స్వేచ్ఛపై దాడి: డీజేయూ

  • 'సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని అరెస్టు, సాక్షిపై దాడులను ఖండించిన డీజేయూ ఏపీ రాష్ట్ర కమిటీ

  • విశ్లేషకుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు దుర్మార్గమైన చర్య,

  • ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి

  • సాక్షి కార్యాలయాలపై దాడుల సరికాదు

  • సాక్షి కార్యాలయాలపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్‌
     

‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు తగవు: ఏపీయూడబ్ల్యూజే

  • సాక్షి పత్రిక కార్యాలయాలపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడులు చేయడాన్ని 
    ఖండించిన ఏపీయూడబ్ల్యూజే

  • దాడులతో పాటు పత్రిక ప్రతులను దహనం చేయడం వంటి చర్యలు దిగ్భ్రాంతి కలిగించాయి

  • సాక్షి కార్యాలయా లపై దాడులకు పూనుకోవడం గర్హనీయం

  • పత్రికా కార్యాలయాలపై దాడులు చేసే సంస్కృతి ప్రమాదకరం
     

‘సాక్షి’పై దాడుల్ని ఖండించిన ఐజేయూ
సాక్షి టీవీ నిర్వహించిన ఒక చర్చ కార్యక్రమంపై నిరసన పేరుతో ఏపీలోని సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు జరిపి, ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నట్టు ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ (ఐజేయూ) అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు కె.విరాహత్‌ అలీ, కె.రాంనారాయణ, సీనియర్‌ సంపాదకుడు డాక్టర్‌ కె.రామచంద్రమూర్తి సోమవారం ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

HYD: సాక్షి ప్రధాన కార్యాలయం వద్ద కొవ్వొత్తులతో సిబ్బంది నిరసన

 ఈ విధ్వంస సంస్కృతి ఏ రకంగానూ సమర్థనీయం కాదన్నారు. కొమ్మినేనిపై కేసు నమోదు చేయడం సరైంది కాదని, క్షమాపణ చెప్పిన జర్నలిస్టును విడుదల చేయాలని కోరారు. సాక్షి పత్రిక, చానల్‌ కార్యాలయాల ధ్వంసానికి పాల్పడ్డ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు.  

‘సాక్షి’కార్యాలయాలపై దాడులను ఖండిస్తున్నాం 
సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును ఐజేయూ మాజీ అధ్యక్షుడు, సీనియర్‌ జర్నలిస్ట్‌ దేవులపల్లి అమర్‌ తీవ్రంగా ఖండించారు. విశ్లేషకుడి మాటలను సాక్షి మీడియా ఖండించినప్పటికీ అరెస్ట్‌ చేశారన్నారు. 70 ఏళ్ల కొమ్మినేనిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి టాక్‌ షోలు చేసే వారు అనేక అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని.. కొమ్మినేనిపై పెట్టినట్టు వారందరిపైనా అక్రమ కేసులు పెడతారా అని ఆయన ప్రశ్నించారు. మహిళలను కించపరిచేవిధంగా, వారి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఎవరూ మాట్లాడకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. 
 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)