Breaking News

ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఆగడాల నుంచి కాపాడండి

Published on Fri, 01/23/2026 - 05:27

చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన ఓ ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఆగడాల నుంచి తమను కాపాడాలంటూ పలువురు మహిళలు పోలీసులను కోరారు. ఈ మేరకు గురువారం ఏఆర్‌ కానిస్టేబుల్‌ పెద్ద రెడ్డప్పపై చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్‌ అకృత్యాలకు సంబంధించిన వాయిస్‌ రికార్డులను కూడా పోలీసులకు అందజేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు... ఎ.రంగంపేటకు చెందిన పెద్ద రెడ్డప్ప కల్యాణి డ్యామ్‌ సమీపంలోని పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌(పీటీసీ)లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. 

ఆయన పోలీసు యూనిఫాంలోనే మద్యం తాగి రంగంపేట బస్టాండ్‌ వద్ద తరచూ స్థానికులు, మహిళలను బూతులు తిడుతూ దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని చెప్పారు. ఆయన ఆగడాలను ప్రశ్నిస్తే తుపాకీతో కాల్చి చంపుతా.. అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. మీరు మాట్లాడే భాష సరిగా లేదంటే... మరింత అసభ్యకంగా మాట్లాడుతూ వాటిని వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టి తీవ్రంగా అవమానిస్తున్నాడని తెలిపారు. 

‘‘మీ కుటుంబాల్లో ఎంత మంది మహిళలు ఉంటే అంతమందిని అనుభవిస్తారా.. నా కొడకల్లారా’’ అంటూ అతడ్ని ఎదిరించినవారికి వాయిస్‌ మెసేజ్‌లు పంపి బెదిరిస్తూ మనోవ్యధకు గురిచేస్తున్నాడంటూ మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. గతంలోనూ పెద్ద రెడ్డప్ప ఇలానే ప్రవర్తించాడని, అప్పట్లో అతనిపై కేసు నమోదు కావడంతో కోర్టులో విచారణ జరుగుతున్నట్లు వివరించారు. కాగా, ఏఆర్‌ కానిస్టేబుల్‌ పెద్ద రెడ్డప్ప భార్య అధికార పార్టీ మహిళా విభాగం నాయకురాలిగా ఉండటం వల్లే ఆయన రెచ్చిపోయి అనుచితంగా వ్యవహరిస్తున్నాడని స్థానికులు మండిపడుతున్నారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)