Breaking News

వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతికి ప్రోత్సాహం

Published on Fri, 12/29/2023 - 05:12

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వెనకబడిన  ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతిని ప్రోత్సహిస్తు­న్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. పారిశ్రామిక­వేత్తలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. జిందాల్‌ సౌత్‌ వెస్ట్‌ (జేఎస్‌డబ్ల్యూ) గ్రూప్‌ చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశ­మయ్యారు.

కడపలో ఉక్కు కర్మాగారం నిర్మాణ పురోగతి, ఇతరత్రా అంశాలపై వారు చర్చించారు. కడప ఉక్కు కర్మాగారం నిర్మాణ ప్రగతిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు సజ్జన్‌ జిందాల్‌ వివరించారు. జనవరి నుంచి ప్రాజెక్టు పనులు మరింత వేగవంతం అవుతాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌­లో ఈ ప్లాంటు కీలకపాత్ర పోషిస్తుందని, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో ఒక మైలు రాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. విజయనగరం జిల్లా ఎస్‌.కోట సమీపంలో ఎంఎస్‌ఎంఈ పార్కు అభివృద్ధి కోసం అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వచ్చేనెలలో దీని శంకుస్థాపకు సన్నద్ధమ­వుతున్నామన్నారు. సౌరవిద్యుత్‌ రంగానికి సంబంధించి రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు జిందాల్‌ సీఎంకు వివరించారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)