Breaking News

ప్రాణం తీసిన ఫైనాన్స్‌ కంపెనీ వేధింపులు

Published on Sat, 01/24/2026 - 05:40

యలమర్రు (పెదపారుపూడి): ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఒకరి నిండు ప్రాణం బలితీసుకుంది. అప్పు తీర్చలేదని ఇంటికి తాళం వేసి, నోటీసులు అంటించటంతో మనస్తాపం చెందిన వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలీ­సులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని యలమర్రు గ్రామానికి చెందిన గేదల హరిఓం ప్రసాద్‌ (44), స్వప్న దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. 

ప్రసాద్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ వ్యవసాయ పనులకు వెళ్తుంటాడు. రెండేళ్ల కిందట ఇంటి నిర్మాణం కోసం ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీ నుంచి రుణం తీసుకున్నాడు. కొంత కాలం నుంచి వాయిదాలు చెల్లించకపోవడంతో కంపెనీ పలుసార్లు నోటీసులు ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో కంపెనీ వాళ్లు గురువారం ఉదయం అధికారులను తీసుకుని గ్రామానికి వచ్చారు. ప్రసాద్‌ ఇంటికి తాళాలు వేసి తలుపునకు నోటీసులు అంటించారు. దీంతో హరిఓం ప్రసాద్‌ కుటుంబ సభ్యులతో పొరుగున ఉన్న ఈదులమా­ద్దాలి గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. 

హరిఓం ప్రసాద్‌ రాత్రి 10 గంటలకు యలమర్రు వెళ్తున్నట్లు భార్య స్వప్నకు చెప్పి బయలుదేరాడు. శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో గ్రామంలో ఉన్న రామాలయం గేటుకు ఉరేసుకుని వేలాడుతున్న హరిఓం ప్రసాద్‌ను చూసి గ్రామస్తులు స్వప్నకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని గుడివాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)