Breaking News

బాలికపై ప్రిన్సిపాల్‌ భర్త లైంగిక దాడికి యత్నం

Published on Tue, 09/03/2024 - 08:31

లక్కిరెడ్డిపల్లి: ఐదో తరగతి చదువుతున్న బాలికపై 55 ఏళ్ల ఓ కామాంధుడు అఘాయిత్యానికి యతి్నంచాడు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ పరిమళ భర్తగా చెప్పుకొనే బాలసుబ్బయ్య ఆదివారం సాయంకాలం లడ్డూ ఆశ చూపి చిన్నారిని ప్రిన్సిపాల్‌ రూమ్‌లోకి పిలిచి లైగింక దాడికి యతి్నంచాడు. బాలిక ఎదురు తిరగడంతో దాడి చేశాడు. దీంతో బాలిక అక్కడి నుంచి తప్పించుకుని హాస్టల్‌ భవనంలోకి వెళ్లిపోయింది. తోటి విద్యార్థులకు విషయం చెప్పడంతో వారు ప్రిన్సిపాల్‌ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ విషయం ఎవరికీ చెప్పొద్దొని ప్రిన్సిపాల్‌ విద్యార్థులను హెచ్చరించింది. సోమవారం మధ్యా­హ్నం ఈ విషయం బయటకు పొక్కడంతో  లక్కిరెడ్డిపల్లె పోలీసులు పాఠశాలకు చేరుకుని బాలసుబ్బయ్య­ను అదుపులోకి తీసుకున్నారు. రోజూ సాయంత్రం ప్రిన్సిపాల్‌ భర్త మరో ఇద్దరిని వెంటబెట్టుకుని పాఠశాల ఆవరణలోకి చొరబడతారని, తాము దుస్తులు మార్చుకుంటుంటే సెల్‌ ఫోన్‌లతో వీడియోలు తీస్తారంటూ విద్యార్థులు విలపించారు. అనంతరం ఈ ప్రిన్సిపాల్‌ మాకొద్దు.. అంటూ విద్యార్థులు పాఠశాల గేటు ఎదుట నినాదాలు చేశారు. అంతలో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ చామకూరి శ్రీధర్, ఆర్డీవో రంగస్వామి, తహసీల్దార్‌ లక్ష్మీ ప్రసన్న పాఠశాల వద్దకు చేరుకుని తల్లిదండ్రులను సముదాయించారు. తమ పిల్లలను పంపించాలంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కాగా, బాలిక బంధువులు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని పోలీసుల అదుపులో ఉన్న బాలసుబ్బయ్యకు దేహశుద్ధి చేశారు. బాలసుబ్బయ్యపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవీంద్రబాబు చెప్పారు.  దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ పాఠశాలను తనిఖీ చేశారు. ప్రిన్సిపాల్‌ పరిమళ, హెల్త్‌సూపర్‌వైజర్‌ లక్ష్మీదేవి, సెక్యూరిటీ గార్డు నాగలక్ష్మీలను సస్పెండ్‌ చేశారు.
 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)