Breaking News

మెలియోడోసిస్‌ వల్లే మరణాలు!

Published on Sun, 09/07/2025 - 03:50

సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుంటూరు రూరల్‌ మండలం తురకపాలెం గ్రామ ప్రజల మరణాలపై మిస్టరీ వీడ­నుంది. గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాల స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్యు­లు, పెథాలజిస్టులు, మైక్రోబయాలజిస్టులు, బయోకెమిస్టులు గ్రామస్తుల నుంచి శాంపిల్స్‌ సేకరిస్తున్నారు. గ్రామంలో జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, ఆయాసం, దగ్గు, ఊపిరి తీసుకో­వడంలో ఇబ్బంది లాంటి సమ­స్య­లు ఉన్నవారికి అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు. 

గ్రామ ప్రజల మరణాలకు అత్యంత అరుదైన మెలియోడోసిస్‌ వ్యాధి కారణమని దాదాపు నిర్ధారించారు. బర్డె్కలియా–సుడోమలై అనే బ్యాక్టీరియా వల్ల ప్రజలు జ్వరాల బారిన పడి మరణిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.  

40 రకాల వైద్య పరీక్షలు  
తురకపాలెం గ్రామంలో 2,507 మంది జనాభా ఉన్నారు. వీరిలో సుమారు 500 మంది పిల్లలు ఉన్నారు. పిల్లలకు మినహా మిగతావారందరికి గుంటూరు వైద్య కళాశాల, జీజీహెచ్‌ వైద్యులు, వైద్య సిబ్బంది సుమారు 40 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు. శనివారం శాంపిల్స్‌ సేకరించి వైద్య కళాశాలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య కళాశాల ప్రిన్సి­పాల్‌ డాక్టర్‌ ఏవీ సుందరాచారి, గుంటూరు డీఎంహెచ్‌వో డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ యశశ్వి రమణ ఆధ్వర్యంలో పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

గత నెలలో స్పందించి ఉంటే... 
గత నెలలోనే తురకపాలెంలో జ్వరంతో బాధ­ప­డుతున్న వారికి గుంటూరులోని ఇన్‌ఫెక్షన్స్‌ స్పెషలిస్టు డాక్టర్‌ కోగంటి కళ్యాణ్‌చక్రవర్తి వైద్య పరీక్షలు చేసి, మెలియోడోసిస్‌ వ్యాధిగా నిర్ధారించారు. ఆ విష­యం మీడియా ద్వారా సైతం వెల్ల­­డించారు. ప్రైవేటు వైద్యుడు వ్యాధి నిర్ధారించి, చికిత్స అందించి ప్రా­ణా­లు కాపాడిన సమయంలోప్ర­భుత్వ వైద్య అధికారులు, జిల్లా, రాష్ట్ర యంత్రాంగం స్పందించి ఉంటే మరణా­ల సంఖ్య తగ్గించే అవకాశం ఉండేది. అధికార య­ంత్రాంగం పట్టించుకోకపోవడం వల్లే మరణాలు పెరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నా­యి.

తురకపాలెంలో ‘ఈనాడు’ ప్రతుల దహనం
మృతుల గురించి అసత్య ప్రచురణలు అసహ్యం కలిగిస్తున్నాయి 
ఎయిడ్స్‌తో మృతి చెందారని ఈనాడు, ఈటీవీల్లో ప్రచారం చేయటం దారుణం 
బాధితులకు న్యాయం చేయాల్సిన మీడియా ప్రభుత్వానికి కొమ్ముకాయడం దుర్మార్గం 
గ్రామ ప్రజల ఆగ్రహం
గుంటూరు రూరల్‌: గుంటూరు జిల్లా తురకపాలెంలో మెలియోడోసిస్‌ బ్యాక్టీరియాతో యువత సైతం మృత్యువాత పడుతుంటే ఈనాడు, ఈటీవీల్లో మృతుల పట్ల అసత్య ప్రచారం చేయడం అసహ్యం కలిగిస్తోందని గ్రామస్తులు మండిపడ్డారు. గ్రామంలోని యువకులు ఎయిడ్స్, షుగర్, వంటి దీర్ఘకాలిక వ్యాధులతో మృతి చెందారని టీవీలో బాహాటంగా ప్రచారం చేయటం గ్రామ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తంచేశారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసిన ఈనాడు దినపత్రిక ప్రతులను శని­వారం గ్రామ ప్రజలు దహనం చేశారు. 

బాధలో తాముంటే, న్యాయం చేయాల్సింది పోయి మృతుల గురించి అసత్య వార్తలు ప్రచారం చేయటం సిగ్గుచేటన్నారు. ఇంటి పెద్దలు మృతిచెంది పిల్లలు, తల్లులు రోడ్డున పడ్డ సమయంలో ఇటువంటి అసత్య ప్రచారం చేసి గ్రామ పరువును, ప్రతిష్టను దెబ్బతీసిన ఈనాడు, ఈటీవీలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. డౌన్‌ డౌన్‌ ఈనాడు, ఈటీవీ, డౌన్‌ డౌన్‌ కూటమి ప్రభుత్వం అంటూ నినాదాలు చేశారు. అన్యాయంపై ప్రభుత్వాన్ని ప్రశి్నంచాల్సిన మీడియా ఇలా ప్రభుత్వానికే కొమ్ముకాయడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)