Breaking News

నాలుగోసారి ప్రెగ్నెంట్‌.. ప్రసవతేదీ దాటిపోయినా రానంటూ మొండికి..

Published on Wed, 11/12/2025 - 09:30

అల్లూరి సీతారామరాజు జిల్లా: ఆమె నిండు గర్భిణి. ప్రసవ తేదీ దాటిపోయి నాలుగురోజులవుతోంది... దీంతో ఆందోళన చెందిన వైద్య సిబ్బందివెంటనే ఆస్పత్రికి రావాలని ఆమెను కోరారు. ఆస్పత్రికి వెళ్లేందుకు ఆమె నిరాకరించింది.సిబ్బంది ప్రాథేయపడినా, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించినా ఆస్పత్రికి వెళ్లకుండా మొండికేసింది. వివరాలు... బూదరాళ్ల పంచాయతీ గరిమండలో  మంగళవారం 104 వైద్య సిబ్బంది వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అదే పంచాయతీ గోధుమలంకకు చెందిన  గర్భిణి పాంగి మౌనిక చికిత్స కోసం అక్కడకు వచ్చింది.

 ఆశా వర్కర్‌ ఆమె వివరాలను వైద్య పర్యవేక్షకులు భూలోకకు తెలియజేసింది. ప్రసవ తేదీ దాటి  నాలుగు రోజులు కావస్తోందని గుర్తించారు. దీంతో ఆమెను వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్తామని, వెంటనే బయలుదేరాలని భూలోక తోపాటు వైద్య సిబ్బంది తెలిపారు. గర్భిణి భర్త కృష్ణకు కూడా నచ్చజెప్పారు.  అయితే ఆస్పత్రికి వచ్చేందుకు గర్భిణి నిరాకరించింది. బుధవారం ఆస్పత్రి వస్తానని తెలిపింది. రాజేంద్రపాలెంకు గోధుమలంక 20 కిలోమీటర్ల దూరంలో ఉందని,  నొప్పులు వస్తే ఇబ్బందులు పడతారని హెచ్‌ఎస్‌ భూలోక, ఏఎన్‌ఎం రాజేశ్వరి, ఎంఎల్‌హెచ్‌పి జోత్స్న  నచ్చజెప్పినా ప్రయోజనం లేకపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినా..అయినా ఆమె స్పందించలేదు.  ఆమె నాల్గోసారి గర్భందాల్చిందని, అబార్షన్‌ కారణంగా మూడో కాన్పు  జరగలేదని హెచ్‌ఎస్‌ భూలోక చెప్పారు.

 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు