Breaking News

వైద్యం వికటించి నిండు గర్భిణి మృతి

Published on Wed, 09/24/2025 - 08:26

జగ్గయ్యపేట అర్బన్‌: ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యులు నిర్లక్ష్యంతో ఓ నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయిన ఘటన పట్టణంలో సోమవారం రాత్రి జరిగింది. కాగా మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డెక్కి ఆందోళన చేయడంతో ఆస్పత్రి యాజమాన్యం రూ.12 లక్షలకు సెటిల్‌మెంట్‌ చేసుకుంది. సేకరించిన సమాచారం ప్రకారం.. పట్టణంలోని విలియంపేటకు చెందిన గర్భిణి అయిన జరుగుమల్లి జాయ్‌(28)కు నెలలు నిండటంతో ప్రసవం కోసం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సోమవారం జాయిన్‌ అయ్యారు.

కాగా రాత్రి సమయంలో వైద్యులు ఇచ్చిన ఇంజెక్షన్‌ వికటించడంతో జాయ్‌తో పాటు కడుపులో ఉన్న శిశువు కూడా మృతిచెందింది. దీంతో ఆగ్రహానికి గురైన మృతురాలి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు అర్ధరాత్రి సమయంలో ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌(తాతయ్య) రంగంలోకి దిగి ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి రూ.12లక్షల సెటిల్‌మెంట్‌కు మృతురాలి కుటుంబ సభ్యులను ఒప్పంచారని తెలుస్తోంది. మృతురాలికి భర్త వంశీ, ఏడేళ్ల కూతురు ఉంది.  

పర్యవేక్షణ లేకనే.. 
ప్రైవేటు ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలపై జిల్లా వైద్యాధికారి పర్యవేక్షణ సరిగా లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని పట్టణ ప్రజలు అంటున్నారు. ఇష్టం వచ్చిన రీతిలో మందులను ఉపయోగిస్తూ అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటున్న ఆస్పత్రులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ నాణ్యమైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)