Breaking News

ప్రకాశం: మర్రిపూడి ఎస్‌ఐ దౌర్జన్యం కేసులో ట్విస్ట్‌

Published on Tue, 06/03/2025 - 16:18

సాక్షి, ప్రకాశం జిల్లా: రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో సామాన్యుల పట్ల పోలీసుల దాడులు పెరిగిపోతున్నాయి ప్రకాశం జిల్లా కొండపి మండలం జాళ్లపాలెంలో మర్రిపూడి ఎస్‌ఐ ఎ.రమేష్‌బాబు మహిళపై దౌర్జన్యం చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితులపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంట్లోకి చొరబడి మహిళపై చేయివేసి విసిరిపడేసి.. అమర్యాదగా ప్రవర్తించిన ఎస్సై రమేష్ బాబును ఎస్పీ వెనుకేసుకొచ్చారు.

బాధితులపైనే కేసులు పెడుతున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ మీడియా ముందు ప్రకటించారు. దళిత ఎస్‌ను అడ్డగించి విధులకు ఆటంకం పరిచారంటూ ఇద్దరు మహిళలతో పాటు ఇంటి యజమాని మారంరెడ్డి కొండలరావుపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.

కాగా, ఈ కేసులో జాళ్లపాలెం గ్రామానికి చెందిన మారంరెడ్డి కొండలరావు అదేరోజు కొండపి పోలీస్‌స్టేషన్‌కు, ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌కు వాట్సాప్‌ ద్వారా ఫిర్యా­దు చేసినా ప్రయోజనం లేకపోవటంతో సోమ­వారం జిల్లా ఎస్పీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం.. జాళ్లపాలెంలో మారంరెడ్డి కొండలరావు నిర్వహిస్తున్న కిరాణా దుకాణంలో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నారు. గత నెల 28న కొండపి మండలం పెట్లూరు శివాలయంలో రూ.7 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు, జరుగుమల్లి మండలం ఎన్‌ఎన్‌ కండ్రిక పంచాయతీ కొత్తపాలెం అంకమ్మ తల్లి ఆలయంలో రూ.70 వేల విలువైన వెండి వస్తువులు, హుండీలో సుమారు రూ.20 వేల నగదు చోరీకి గురయ్యాయి.

మర్రిపూడి ఎస్ఐ రమేష్ బాబు దౌర్జన్యం కేసులో ట్విస్ట్

ఈ కేసుల విచారణలో భాగంగా మర్రిపూడి ఎస్‌ఐ రమేష్‌బాబు జాళ్లపాలెం వెళ్లారు. కొండలరావు షాపు వద్ద సీసీ కెమెరా ఉన్నట్టు తెలుసుకుని అతడి కుటుంబ సభ్యులను సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించాలని కోరారు. వారు యజమాని కొండలరావు లేరని చెప్పగా.. ఎస్సై రమేష్‌బాబు వెంటనే కొండలరావు కుమారుని ద్వారా ఫోన్‌ చేయించి అతడితో మాట్లాడారు. కొండలరావు ఎస్‌ఐతో మాట్లాడుతూ తాను ఊళ్లో లేనని, సాయంత్రం వస్తానని, పెన్‌డ్రైవ్‌ ఇస్తే సీసీ ఫుటేజీ కాపీ చేసి పంపిస్తానని మర్యాదపూర్వకంగా చెప్పారు.

దీంతో ఎస్‌ఐ రమేష్‌బాబు తాను స్వయంగా సీసీ కెమెరా ఫుటేజీ చెక్‌ చేసుకుంటానని చెప్పడంతో ‘సార్‌ మీరు నా ఇంట్లోకి వెళ్లడానికి వీల్లేదు. మీ మీద నాకు నమ్మకం లేదు’ అని చెప్పాడు. దీంతో అహం దెబ్బతిన్న ఎస్సై ‘మా మీద నమ్మకం లేదా’ అనడంతో కొండలరావు ‘నమ్మకం లేదు. గత ఏడాది నవంబర్‌లో మర్రిపూడి మండలం జగ్గరాజుపాలెం పెట్రోల్‌ బంకులో నాపై దాడి జరిగిందని ఫిర్యాదు చేస్తే నన్ను మూడు గంటలపాటు నిలువరించటమే కాక మీరు నేరస్తుల పక్షాన నిలబడి నాపై తప్పుడు కేసు పెట్టమని సలహా ఇచ్చారు.

నేటి వరకు ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయలేదు’ అనడంతో ఎస్‌ఐ ఫోన్‌ కట్‌ చేశారు. తరువాత కొండలరావు కుటుంబ సభ్యులపై ఎస్‌ఐ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఎంత పొగరు. తలుపులు వేసేస్తారా’ అని తలుపులు నెట్టుకుంటూ షాపులోకి వెళ్లి కుటుంబ సభ్యులను కొట్టారు. షాపులో ఉన్న కొండలరావు చెల్లెలు చంద్రమ్మను చేతితో నెట్టుకుంటూ ఆమెను దూషిస్తూ బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి సీసీటీవీ ఎన్‌వీఆర్, మొబైళ్లు, పెన్‌డ్రైవ్‌లు జేబులో వేసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనపై కొండలరావు కొండపి పోలీస్‌స్టేషన్‌లోను, ఎస్పీకి వాట్సాప్‌ ద్వారా ఫిర్యా­దు చేశారు. అయినా ఇంతవరకు న్యాయం జరగలేదని, తక్షణమే విచారించి న్యాయం చేయటంతో పాటు దోషులను శిక్షించి తమ వద్ద లూటీ చేసిన ఆస్తులను రికవరీ చేసి ఇప్పించాలని మరోమారు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)