Breaking News

వివాహేతర సంబంధం.. జంట ఆత్మహత్య

Published on Mon, 07/07/2025 - 05:41

కొమరోలు/ప్యాపిలి: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ జంట బలవన్మరణానికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లె గ్రామ సమీప రేగలగడ్డ చెరువు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, మృతుల కుటుంబ సభ్యుల కథనం మేరకు.. నంద్యాల జిల్లా డోన్‌ నియోజకవర్గం ప్యాపిలి మండలం మాధవరం గ్రామానికి చెందిన కట్టెల భారతికి(20)మూడేళ్ల క్రితం అలేబాదు గ్రామానికి చెందిన శివప్రసాద్‌తో వివాహం జరిగింది. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి ఏడాదిగా భారతి స్వగ్రామంలో ఉంటోంది.

ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన కంబగిరి రాముడు(26)తో భారతికి వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం పెద్దలకు తెలియడంతో వారు హెచ్చరించారు. దీంతో ఇరువురూ ఈ నెల 4న ఇంటి నుంచి పారిపోయారు. ఇరువురి కుటుంబ సభ్యులు గ్రామ చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో శనివారం సాయంత్రం రాముడు తన తండ్రి పాపయ్యకు వాట్సాప్‌ ద్వారా లొకేషన్‌ పంపించి ఫోన్‌ స్విచాఫ్‌ చేశాడు. స్థానిక ఎస్సై నాగరాజు ఆదివారం తెల్లవారుజామున సిబ్బందితో కలిసి లొకేషన్‌ ఆధారంగా అక్కపల్లె గ్రామానికి చేరుకున్నారు. చుట్టుపక్కల గాలించగా భారతి, రాముడు చెట్టుకు ఉరి వేసుకుని విగత జీవులుగా కనిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)