Breaking News

ఇది ‘న్యాయ’మేనా!

Published on Mon, 11/04/2024 - 05:54

ప్రతిష్టాత్మక న్యాయ సంస్థలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ), లోకాయుక్తలకు సారథులు లేక అనాధలుగా మారాయి. హెచ్‌ఆర్‌సీ చైర్మన్, సభ్యుల పదవీ కాలం ముగిసి ఏడునెలలు గడిచింది. అలాగే, లోకాయుక్త చైర్మన్‌ పదవి కాలం కూడా సెప్టెంబరు 14తో ముగిసింది. దీంతో రెండు సంస్థలకు సారథులు లేకపోవడంతో పెండింగ్‌ కేసులు పెరిగిపోతు­న్నాయి. నిజానికి.. సుప్రీంకోర్టు మార్గ­దర్శ­కాల ప్రకారం వీరి నియామకాలు 90 రోజుల్లో జర­పాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం  స్పందించకపోవడంతో పేద­లకు ఉచిత న్యాయ సేవలు అందడంలేదు. –కర్నూలు (సెంట్రల్‌)

ఏడు నెలలు గడిచినా చలనంలేదు..
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌గా మాంథాత సీతారామమూర్తి, జ్యూడిషియల్‌ సభ్యు­డిగా దండే సుబ్ర­మ­ణ్యం, నాన్‌ జ్యూడిషి­యల్‌ æసభ్యుడు జి. శ్రీనివాసరావుల మూడేళ్ల పదవి కాలం 2024 మార్చి 23తో ముగిసింది. దీంతో అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం మార్చి 15 నుంచి 30 వరకు కమిషన్‌ చైర్మన్, సభ్యుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించింది. 

అయితే, ఎన్నికలు రావడంతో అప్పట్లో ఈ ప్రక్రియ ఆగిపోయింది. చైర్మన్‌గా సుప్రీంకోర్టు, హైకోర్టులలో ప్రధాన న్యాయ­మూర్తులు, న్యాయమూర్తిగా పనిచేసిన వారిని.. జ్యూడిషియల్‌ సభ్యుడిగా న్యాయ సంబంధ అంశాల్లో పట్టున్న వారు, నాన్‌ జ్యూడిషియల్‌ సభ్యుడు ఎన్‌జీఓల్లో పని­చేసిన అనుభవం ఉన్న వారిని ఎంపిక చేస్తారు.

ముఖ్య­మంత్రి, ప్రతిపక్ష నేత, స్పీకర్, కేబినెట్‌లో సీనియర్‌ మంత్రి, శాసనమండలి చైర్మన్, విపక్ష నేత సభ్యులుగా ఉండే ప్యానల్‌ చైర్మన్, సభ్యులను ఎంపిక చేసి గవర్నర్‌కు పంపితే ఆయన ఆమోదం తరువాత కమిషన్‌ మూడేళ్ల­పాటు అమల్లోకి వస్తుంది. కాగా, హెచ్‌ఆర్‌సీ చైర్మన్, సభ్యుల నియామకం కోసం స్వీకరించిన అర్జీలు న్యాయశాఖ దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి.

లోకాయుక్తలో స్తంభించిన కార్యకలాపాలు..
ఇక లోకాయుక్త చైర్మన్‌గా జస్టిస్‌ పి. లక్ష్మణ్‌­రెడ్డి పనిచేశారు. 2024 సెప్టెంబర్‌ 14న ఆయన పదవీకాలం ముగిసింది. దీంతో అప్పటి నుంచి ఆ పోస్టు కూడా ఖాళీగా ఉంది. ఈ క్రమంలో లోకాయుక్తలో కార్యక­లా­పాలు స్తంభించాయి. లోకాయుక్త చైర్మన్‌­ను కూడా సీఎం, ప్రతిపక్ష నేత, స్పీకర్, సీనియర్‌ మంత్రి, శాసన మండలి చైర్మన్, విపక్ష నేతలతో కూడిన కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్‌ ఎంపిక చేస్తారు. లోకా­యుక్త చైర్మన్‌గా సుప్రీంకోర్టు, హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తులు, న్యాయ­మూర్తు­లుగా పనిచేసిన వారిని నియమిస్తారు. 

మూడేళ్ల నుంచి కర్నూలు కేంద్రంగా..
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త సంస్థల ద్వారా ఏటా ఒక్కోదానిలో దాదాపు వెయ్యికి పైగా కేసు­లు పరిష్కా­ర­­­మ­వుతాయి. పైగా ఆయా సంస్థల్లో పైసా ఖర్చు­లే­కుండా న్యాయ ఫిర్యాదులు చేసుకునే వీలుండడంతో రాష్ట్రం నలు­మూ­లల నుంచి ప్రజలు తమ ఫిర్యాదు­ల­ను పంపుతారు. లెట­ర్‌ రాసి పంపినా కేసు నమోదు చేస్తారు. లేదంటే.. ఆయా సంస్థల ఈ–మెయిళ్లు, వెబ్‌సైట్‌­లోనూ ఫిర్యా­దు చేసి­నా వాది, ప్రతివాదులకు నోటీసు­లిచ్చి విచా­రణలు జరుపు­తుండ­డంతో పేద, మధ్య­తర­గతి వర్గాల ప్రజలు వీటిని ఆశ్రయిస్తు­న్నారు.

పేదలకు ఉచిత న్యాయ సేవలు..
హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్తల ద్వారా పేదలకు ఉచిత న్యాయ సేవ­లు అందు­తాయి. న్యాయం కోసం పేదలు, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఎక్కు­వగా హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త­లను ఆశ్ర­­యించి న్యాయం పొందు­తారు. కానీ, ఇప్పుడివి లేకపో­వడంతో ఆయా సంస్థల్లో కార్యకలా­పాలు స్తంభించి­పోయాయి.   – కృష్ణమూర్తి, బార్‌ అసిసోయేషన్‌ అధ్యక్షుడు, కర్నూలు

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)