Breaking News

మంత్రి ర్యాలీ హడావుడి: గర్భిణిని పక్కకు లాగేసిన పోలీసులు

Published on Sun, 01/25/2026 - 08:39

సాక్షి, విశాఖపట్నం: ఓవైపు నిర్వహణ లోపు.. మరోవైపు పోలీసుల ఓవరాక్షన్‌తో విశాఖ ఉత్సవ్‌ తొలిరోజున ఆశించిన స్పందన కనిపించలేదు. పోలీసుల అత్యుత్సాహంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రారంభోత్సవ సమయంలో మంత్రులు బీచ్‌రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. ఈ సమయంలో పోలీసుల ట్రాఫిక్‌ ఆంక్షలు సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ర్యాలీ ప్రారంభం కాకముందు నుంచి మంత్రులు వేదిక వద్దకు చేరుకున్న వరకూ గంటల తరబడి వాహనాలు నిలిపేశారు. ఇదే సమయంలో బీచ్‌కు వచ్చిన ఓ గర్భిణి విషయంలో పోలీసుల ప్రవర్తించిన తీరు స్థానికుల్ని తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేసింది. 

ర్యాలీ వస్తోందంటూ గర్భిణిని పక్కకు విసురుగా లాగేశారు. కిందపడిపోతున్న ఆమెని బంధువులు పట్టుకున్నారు. ఈ ప్రవర్తనతో ఒక్కసారిగా బంధువులు పోలీసులపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనని చూసిన స్థానికులు కూడా పోలీసుల తీరుని తప్పుపడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులు, సందర్శకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దాదాపు 20 నిమిషాల పాటు పోలీసుల తీరుని తప్పుపడుతూ వారితో వాదులాడారు. ఉన్నతాధికారులు వచ్చి.. నచ్చజెప్పడంతో శాంతించారు. రాకపోకలను నిలిపేయడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. బీచ్‌కు వచ్చిన వారంతా రోడ్లపై వాహనాల్లోనే గంటల పాటు ఉండిపోయి అసహనం వ్యక్తం చేశారు. 

స్టీల్‌ప్లాంట్‌ ఎక్కడ..? 
విశాఖ ఉత్సవ్‌ ప్రారంభించిన సమయంలో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు సంబంధించి ఉత్సవ్‌ ఏవీని మంత్రులు విడివిడిగా ఆవిష్కరించారు. విశాఖ ఏవీలో మాత్రం స్టీల్‌ప్లాంట్‌ గురించి ఎక్కడా కనిపించలేదు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖకు గుండెకాయలాంటి విశాఖ ఉక్కు పరిశ్రమ లేకుండా.. వైజాగ్‌ ఏవీ ఎలా తయారు చేశారంటూ ముక్కున వేలేసుకున్నారు.

 ప్రైవేటీకరణకు చంద్రబాబు ప్రభుత్వం సహకరిస్తున్న నేపథ్యంలో.. స్టీల్‌ ప్లాంట్‌ విషయాన్ని ప్రజలకు గుర్తు చేయకుండా ఉండేందుకే ఈ విధంగా ఏవీలో లేకుండా చేశారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా.. ఉత్సవాలు జరుగుతున్న ప్రాంతంలో విశాఖకు చెందిన ప్రసిద్ధ ఆలయాల నమూనాలు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రపంచ ప్రసిద్ధి చెందిన సింహాచలం దేవస్థానం కనిపించకపోవడం గమనార్హం. దీనిపై కొందరు స్థానికులు నిలదీయగా.. రేపటిలోగా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్వాహకులు బదులిచ్చినట్లు తెలుస్తోంది.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)