Breaking News

టీచర్‌తో కానిస్టేబుల్‌ వివాహేతర సంబంధం..!

Published on Mon, 12/22/2025 - 08:29

నరసరావుపేట టౌన్‌: సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన కానిస్టేబుల్‌ దారితప్పారు. తన భార్యతో కానిస్టేబుల్‌ వివాహేతర సంబంధం పెట్టుకొని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని, అతని నుంచి రక్షణ కల్పించాలని భర్త తమ పిల్లలతో కలిసి ఫిర్యాదు చేశారు. అధికారులు అందుబాటులో లేరని ఫిర్యాదు ఇచ్చేందుకు మరో రోజు రావాలని సిబ్బంది వెనక్కు పంపారు. పల్నాడు జిల్లా గురజాల సబ్‌ డివిజన్‌లోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబందించి వివరాలు ఇలా ఉన్నాయి. 

పల్నాడు జిల్లాలో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్‌ తాను నివాసం ఉండే సమీపంలో ఉంటున్న ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలితో గత కొంత కాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. విషయం భర్తకు తెలిసి కానిస్టేబుల్‌ను నిలదీయడంతో అతనిపై బెదిరింపులకు దిగారు. దీంతో భర్త తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని శనివారం ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళ్లారు. పిడుగురాళ్లలో నిర్వహిస్తున్న శ్రీనివాస కల్యాణ కార్యక్రమం విధుల నిమిత్తం అధికారులు వెళ్లడంతో స్టేషన్‌లో అందుబాటులో లేరు. 

అధికారులను కలిసి ఫిర్యాదు చేసేందుకు భర్త గంటలకొద్దీ వేచి ఉన్నా రాలేదు. మరో రోజు రావాలని సిబ్బంది ఫిర్యాదు స్వీకరించకుండా వెనక్కు పంపారు. దీర్ఘకాలంగా ఒకే స్టేషన్‌లో పనిచేస్తూ స్టేషన్‌లో రికార్డు వర్క్‌ చేస్తున్న ఆ కానిస్టేబుల్‌పై గతంలో కూడా అనేక అవినీతి ఫిర్యాదులు ఉన్నాయి. అయితే అధికారులకు నెలవారీ మామూళ్లు వసూళ్లు చేయటంలో సదరు కానిస్టేబుల్‌ కీలక పాత్ర పోషిస్తుండటంతో అధికారులు అతని అక్రమాలకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కానిస్టేబుల్‌ ఆగడాలపై పల్నాడు జిల్లా ఎస్పీని సోమవారం కలిసేందుకు బాధితుడు సిద్ధమైనట్లు సమాచారం.     

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)