Breaking News

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి పీఏ కిడ్నాప్‌నకు యత్నం

Published on Sun, 09/22/2024 - 04:59

మాచర్ల: మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పీఏ ఎం.శ్రీనివాస శర్మను కిడ్నాప్‌ చేయడానికి టీడీపీ వర్గీయులుగా భావిస్తున్న కొందరు గూండాలు ప్రయత్నించా­రు. పోలీసులు రంగంలోకి దిగడంతో ఆయన్ని వదిలేసి పరారయ్యారు.  శర్మ కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. పిన్నెల్లికి చాలా కాలం నుంచి పీఏగా పనిచేస్తున్న శ్రీనివాస శర్మను టీడీపీ వర్గీయులు కొందరు టార్గెట్‌ చేసుకున్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని ఆయన ఇంటికి  టీడీపీ గుర్తులు కలిగిన స్కారి్పయో వాహనంలో గుర్తు తెలియని ఐదుగురు దుండగులు వచ్చారు.

ఇంటి ముందు వాహనాన్ని ఆపి హడావుడిగా దిగారు. ఆ ప్రాంతానికి ఇతరులు రాకుండా ముగ్గురు నిలబడగా, ఇద్దరు ఇంటి ముందు తలుపులను కర్రలతో కొట్టారు. అవి రాకపోవటంతో మరో వైపు నుంచి తలుపులు బద్దలుకొట్టి దౌర్జన్యంగా ఇంటిలోకి ప్రవేశించి శ్రీనివాస శర్మ­ను బెదిరించారు. తన భర్తను ఏమీ అనవద్దని, కొట్టవద్దని శర్మ భార్య వేడుకొన్నా వారు దౌర్జన్యంగా ప్రవర్తించారు. శర్మ రావాల్సిందేనని, లేకపోతే ఊరుకునేది లేదని బెదిరించారు. శ్రీనివాసశర్మ రానని చెప్పటంతో బయట ఉన్న ముగ్గురు కూడా లో­పలకు వచ్చారు. శర్మను బలవంతంగా ఎత్తుకొని తీసుకెళ్లి వాహనంలో ఎక్కించారు.

స్కార్పియోలో గుంటూరు రోడ్డు వైపు తీసుకెళ్లారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి కూడా పలువురు సమాచారమిచ్చారు. పట్టణ, నియోజక వర్గంలోని సీఐ­లు వెంటనే రంగంలోకి దిగారు. కిడ్నాప్‌ చేసిన వారి ఆచూకీ తెలుసుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో కిడ్నాపర్లు శ్రీనివాస శర్మను కారంపూడి సమీపంలో వదిలివేసి పరారయ్యారు. ఆయన తెలిసిన వారి వాహనం ఎక్కి మాచర్లలోని ఇంటికి చేరుకున్నారు. వెంటనే కారంపూడి, మాచర్ల అర్బన్, రూరల్‌ సీఐలు శర్మ ఇంటికి చేరుకొని జరిగిన సంఘటనపై విచారణ జరిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు మాచర్ల అర్బన్‌ సీఐ చెప్పారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)