Breaking News

నేడు పీజీ సెట్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌

Published on Sun, 09/07/2025 - 06:07

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో పీజీ విద్యలో ప్రవేశాల కౌన్సెలింగ్‌కు ఉన్నత విద్యామండ­లి ఆదివారం కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ వి­డుదల చేయనుంది. ప్రభుత్వం వర్సిటీల నుంచి డిగ్రీ ఫలితాలు విడుదల, సర్టీఫికెట్ల జారీ సమన్వయం చేయడంలో విఫలం కావడంతో కౌన్సెలింగ్‌ ఆలస్యమైంది. దీనికి తోడు చాలా చోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపులు నిలిచిపోవడంతో కళాశాలలు విద్యార్థులకు సర్టీఫికెట్లు మంజూరు చేయలేదు. ఫలితంగా వి­ద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అవాంతరాలు ఎదుర్కొన్నారు. దీనికి తోడు పీజీ కౌన్సెలింగ్‌ను ఉమ్మడిగా కాకుండా వర్సిటీల వారీగా చేపట్టుకునేందుకు అవకాశమివ్వాలని వీసీలు కోరడంతో ఉన్నత విద్యా మండలి  ప్రభుత్వానికి జూలై మూడో వారంలో లేఖ రాసింది.

నెలపాటు ఆ లేఖకు ప్రభుత్వం స్పందించకుండా ఇటీవల పాత పద్ధతిలోనే కౌన్సెలింగ్‌ కొనసాగించాలని సూచించింది. కన్వినర్‌ నియామకం విషయంలో ఉన్నత విద్యా మండలికి, పీజీ సెట్‌ నిర్వహించిన వెంకటేశ్వర వర్సిటీకి మధ్య సమన్వయ లోపం ఏర్పడింది. ఫలితంగా కన్వినర్‌ నియామకం ఆలస్యమైంది. మరోవైపు వెంకటేశ్వర వర్సిటీ కౌన్సెలింగ్‌ నిర్వహణకు ఆసక్తి చూపని కారణంగా మరో వర్సిటీకి ఆ బాధ్యతలు అప్పగించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. చాలా వర్సిటీలు పీజీ కళాశాలకు అఫిలియేషన్‌ మంజూరు నత్తనడకన సాగడంతో కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ ప్రక్రియ ముందుకు సాగలేదు. దీనిపై ఉన్నత విద్యా మండలి వర్సిటీల వారీగా రిజి్రస్టార్లతో సమావేశమై  వేగంగా కళాశాలలకు అఫిలియేషన్‌ మంజూరు చేయాలని ఆదేశించింది. 

యూజీ ఆయుష్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ 
యూజీ ఆయుష్‌ కోర్సుల్లో కన్వీనర్‌ కోటా ప్రవేశాలకు శనివారం ఆరోగ్య వర్సిటీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. నీట్‌ యూజీ అర్హత సాధించిన విద్యార్థులు సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ నెల 16వ తేదీ రాత్రి 9 గంట­లలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 2,950, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 2,360 దరఖాస్తు రుసుము చెల్లించాలి. వివరాలకు 9000780707, 8008250842 నంబర్లను సంప్రదించాలి. 

Videos

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)