Breaking News

అత్యధికుల జీవితం అప్పులతో సరి

Published on Sat, 09/21/2024 - 04:14

సాక్షి, అమరావతి: భారతీయుల్లో ఎక్కువ మంది ఎడాపెడా అప్పులు చేసేస్తున్నారా. అవునంటోంది కేర్‌ఎడ్జ్‌ రేటింగ్స్‌ సంస్థ. మనవాళ్లు పొదుపు చేయడం కంటే.. అప్పులు చేయడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని స్పష్టం చేస్తోంది. భారతీయులకు పొదుపు కంటే రెండు రెట్లు అధికంగా అప్పులు ఉన్నట్టు కేర్‌ఎడ్జ్‌ రేటింగ్స్‌ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 

వ్యక్తిగత అప్పులు ఈ స్థాయిలో పెరగడం ఆందోళన కలిగిస్తున్నా.. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇవి ప్రమాదకర స్థాయిలో లేవని పేర్కొంది. దేశ జీడీపీలో వ్యక్తిగత అప్పులు ఏకంగా 38 శాతానికి చేరాయి. ప్రస్తుతం దేశ జీడీపీ 2023–24 ఆర్థిక సంవత్స­రానికి రూ.173.82 లక్షల కోట్లుగా అంచనా వేస్తుంటే.. అందులో 38 శాతం అంటే సుమారు రూ.66 లక్షల కోట్లకు సమానమైన అప్పులు మనవాళ్లు చేశారు. 

వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలైన బ్రెజిల్‌ జీడీపీలో వ్యక్తిగత అప్పులు 35 శాతం, దక్షిణాఫ్రి­కాలో 34 శాతానికే పరిమిత­మైనట్టు కేర్‌ఎడ్జ్‌ తన నివేదికలో పేర్కొంది. ఇదే సమయంలో మన దేశంలో వ్యక్తిగత పొదుపు జీడీపీలో 24 శాతానికే అంటే రూ.42 లక్షల కోట్లకే పరిమిత మైంది.

అప్పులతో ‘రియల్‌’ పరుగులు
మొత్తం వ్యక్తిగత అప్పుల్లో 50 శాతం గృహ­రు­ణాలే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు రుణాలు తీసుకుంటుండడం వ్యక్తిగత అప్పులు భారీగా పెరగడానికి ప్ర­ధా­న కారణంగా పేర్కొంది. అప్పు తీసుకుని ఖర్చు చేయకుండా సంపద సృష్టించుకోవడం కోసం వ్యయం చేస్తుండటాన్ని ఆహ్వానించింది. 

అప్పు తీసుకుని విలాసాలకు ఖర్చు చేయకుండా ఇల్లు, రియల్‌ ఎస్టేట్‌ వంటి సంపద సృష్టికి విని యోగంచడం సంతోషం కలిగించే విషయంగా పేర్కొంది. దేశంలో పొదుపు ఆలోచనలో భారీ మార్పు వచ్చిందని, బ్యాంకు డిపాజిట్లు వంటి వాటికంటే స్థిరాస్తుల్లో అధికంగా ఇన్వెస్ట్‌ చేయ డానికి మొగ్గు చూపుతున్నట్టు పేర్కొంది. 

అభివృద్ధి చెందిన దేశాల్లో అప్పులు విలాసాలకు విని యోగిస్తారని, కానీ.. భారత దేశంలో అప్పులను సంపద సృష్టికి వినియోగిస్తుండటంతో జీడీపీలో వ్యక్తిగత అప్పులు 38 శాతానికి చేరినా అది ప్ర మాదకర స్థాయి కాదని వెల్లడించింది. ఈ అప్పు లు నియంత్రించే స్థాయిలోనే ఉన్నట్టు పేర్కొంది. ఇతర అప్పులు వస్తే క్రెడిట్‌ కార్డు వంటి అన్‌ సెక్యూర్డ్‌ రుణాలు భారీగా పెరుగు తున్నట్టు హె చ్చరించింది. ఇదే సమయంలో వ్యక్తిగత ఆదా యం వృద్ధి చెందాల్సి ఉంటుందని పేర్కొంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)