Breaking News

ఈ పేద జీవితంలో ఆశలు చిగురించాయి 

Published on Sat, 07/08/2023 - 03:32

కొండపల్లి(ఇబ్రహీంపట్నం): ‘నేను నిరు­పేదను. ఎలాంటి స్థిరాస్తులు లేవు. రోజువారీ కూలీ అయిన నేను కుటుంబ అవసరాలు తీర్చలేకపోవడంతో పాటు పిల్లల చదువుల కోసం ఎంతో ఇబ్బందులు పడుతుండేవాడిని. ఇలాంటి నా జీవితంలో సంక్షేమ పథకాలతో వెలుగులు నింపారు. సగర్వంగా తలెత్తుకుని జీవించేలా చేశారు. ఆర్థికంగా చితికిపోకుండా జీవితంపై ఆశలు చిగురింప చేసిన జగనన్నా ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి.

మా కుటుంబం మొత్తం మీ వెనుక నడుస్తాం’ అంటూ ఓ నిరుపేద తన అభిమానాన్ని ఫ్లెక్సీ రూపంలో తెలిపాడు. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్ర­హీంపట్నం మండలం కొండపల్లికి చెందిన ఎస్‌ఎన్‌ మీరా (సుభానీ) కుటుంబం కూలి పనులు చేసుకుని జీవిస్తుంటుంది. అన్నింటికీ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ంది.

అతనికి పలు పథకాల ద్వారా లబ్ధి అందించింది. దీంతో అతను దీన స్థితి నుంచి బయటపడి సగౌరవంగా జీవిస్తున్నాడు. తన కుటుంబానికి ప్రభుత్వం ఏమి లబ్ధి చేకూర్చిందో ఫ్లెక్సీ వేసి తన ఇంటి గోడకి అతికించాడు. ‘మీ ఉప్పు తింటున్నాం.. మీకు విశ్వాసంగా ఉంటాం’ అంటూ ప్లెక్సీ వేయించి సీఎం జగన్‌కు, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

ఫ్లెక్సీలో ఇలా రాశాడు.. 
♦ వైఎస్సార్‌ చేయూత పథకంలో వచ్చి న రూ. 56,250తో నా భార్య జక్రియా బేగం కిరాణా షాపు ఏర్పాటు చేసుకుంది.  
♦ డ్వాక్రా రుణమాఫీతో రూ.36 వేలు లబ్ధి.
♦ కుమార్తె ఫాతిమా జేఎన్టీయూలో ఎంటెక్‌ చదువుకు వసతి దీవెన కింద రూ.40 వేలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.30వేలు, కుమారుడు బీకాం కంప్యూటర్స్‌ చదువుకు రూ.45 వేలు ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన కింద రూ.30 వేలు, మరో కుమార్తె నబీనా  ఎమ్మెస్సీ బీఈడీ చదువుకు ఫీజు రూ. 30 వేల లబ్ధి చేకూరింది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)