Breaking News

వైద్య సేవలందక వ్యక్తి మృతి

Published on Mon, 08/05/2024 - 06:29

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సకాలంలో వైద్య సేవలు అందక నెల్లూరు జిల్లా సైదాపురంలో ఆదివారం ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆగ్రహించిన ప్రజలు పీహెచ్‌సీ ఎదుట ధర్నాకు దిగారు.  సైదాపురం దళితవాడకు చెందిన మల్లారపు వీరరాఘవయ్య (49) ఆటో నడుపుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం  అతడి నోట్లో నుంచి నురుగు రావడంతో  సమీపంలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. 

అక్కడ కేవలం స్టాఫ్‌ నర్సు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రథమ చికిత్స కూడా చేయకుండానే గూడూరు ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సలహా ఇవ్వడంతో గూడూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతడు మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు దళితవాడకు చెందిన యువత పీహెచ్‌సీకి చేరుకుని ధర్నాకు దిగారు.  

కనీస వైద్య సేవలు అందకపోవడం వల్లే వీరరాఘవయ్య మృతి చెందాడని వాపోయారు.  వివిధ పార్టీల నేతలు ఆందోళనకారులకు మద్దతు ప్రకటించారు. ఉన్నతాధికారులు వచ్చేంత వరకు ఆందోళన విరమించమని భీషి్మంచుకు కూర్చున్నారు.  ఎస్‌ఐ డీఎస్‌ విజయ్‌కుమార్‌ అక్కడకు చేరుకుని సమగ్ర విచారణ జరిపారు. ఇక్కడి పరిస్థితిని రాపూరు సీఐ విజయకృష్ణకు వివరించారు. అక్కడి నుంచే సీఐ ఆందోళనకారులను శాంతింపజేశారు. 
– సైదాపురం 

Videos

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)