Breaking News

అడ్వాన్స్‌ టెక్నాలజీతో ప్రజల ప్రాణాలను కాపాడాలి

Published on Sat, 09/16/2023 - 03:59

గన్నవరం రూరల్‌: ఓరల్‌ మ్యాక్సిలో ఫేషి­యల్‌ సర్జరీ (దవడ ఎముకల శస్త్ర చికిత్స)లో అడ్వాన్స్‌ టెక్నాలజీతో ప్రజల ప్రాణాలు రక్షించాలని డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ కె.బాబ్జీ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలంలోని చిన అవుటపల్లిలో ఉన్న డాక్టర్స్‌ సుధా అండ్‌ నాగేశ్వరరావు సిద్ధార్థ దంత వైద్య కళాశాలలో శుక్రవారం 15వ వార్షిక రాష్ట్రస్థాయి అసోసియేషన్‌ ఆఫ్‌ ఓరల్‌ మ్యాక్సిలో ఫేషియల్‌ సర్జన్స్‌ సదస్సును ఆయన ప్రారంభించి ప్రసంగించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాల రక్షణకు ట్రామా కేర్‌ సెంటర్లు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిందని చెప్పారు. వీటిలో సైతం ఓరల్‌ మ్యాక్సిలో ఫేషియల్‌ సర్జన్స్‌ను నియమించాలన్నారు. ఈ రంగంలో మహిళల భాగస్వామ్యం  పెరగడం గర్వించాల్సిన విషయమన్నారు. ఏషియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఓరల్‌ మ్యాక్సిలో ఫేషియల్‌ సర్జరీ అధ్యక్షుడు డాక్టర్‌ గుణశీలన్‌ రాజన్‌ మాట్లాడుతూ.. అతి చిన్న దేశమైన కొరియా ఇంప్లాంటేషన్స్‌ ఉత్పత్తిలో ముందుందని తెలిపారు.

వారియర్స్‌ ఆఫ్‌ది ఫేస్‌ అనే థీమ్‌తో ఈ కాన్ఫరెన్స్‌లో ముఖానికి సంబంధించిన ఆధునాతన శస్త్ర చికిత్సలపై, ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం వచ్చిన నూతన సర్జరీ పద్ధతులపై, ప్రమాదాల్లో ముఖాలకు గాయాలు, నోటి క్యాన్సర్‌ వంటి వాటికి శస్త్ర చికిత్స, అనాదిగా ఉన్న గ్రహణం మొర్రిని పూర్తిగా నిర్మూలించడంపై నిపుణులు రెండు రోజుల పాటు చర్చిస్తారు.

ఏవోఎంఎస్‌ఐ జాతీయ ఉపాధ్యక్షుడు ఆర్‌.మణికందన్, ఆర్గనైజింగ్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె.వై.గిరి, ఏవోఎంఎస్‌ఐ అధ్యక్షుడు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డాక్టర్‌ ఎన్‌.కోటేశ్వరరావు, జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ ఎన్‌.కిరణ్‌కుమార్, ఏవోఎంఎస్‌ఐ జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మహబూబ్‌ షేక్, రాష్ట్ర మాజీ చైర్మన్‌ శివనాగేందర్‌రెడ్డి, డాక్టర్‌ సుధానాగేశ్వరరావు దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.వి.రామోజీరావు, ఏవో వై.మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)