Breaking News

అలా చూస్తూ ఉంటే బీపీ వచ్చేస్తుంది

Published on Thu, 01/16/2025 - 05:24

సాక్షి, అమరావతి: ప్రస్తుత సోషల్‌ మీడియా యుగంలో వినోదం, వ్యాపార ప్రకటనలు, ప్రచారాల్లో రీల్స్, షార్ట్‌ వీడియోస్‌ హవా నడుస్తోంది. పిల్లలు, కుర్రకారు, పెద్దలు కూడా మొబైల్‌ రీల్స్‌ చూడటానికి గంటల సమయం కేటాయిస్తున్నారు.

కొంచెం ఖాళీ సమయం దొరికితే చాలు మొబైల్‌లో ఫేస్‌ బుక్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్‌ వంటి సోషల్‌ మీడియా యాప్‌లు ఓపెన్‌ చేయడం.. అందులో వచ్చే షార్ట్‌ వీడియోస్, రీల్స్‌ చూస్తూ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు షేర్‌ చేయడం ఓ దైనందిన కార్యక్రమం అయిపోయింది. 

ఇది రాన్రాను ఓ వ్యసనంలా మారి, విలువైన సమయాన్ని హరించడంతో పాటు, అధిక రక్తపోటు (బీపీ) ముప్పు తెస్తోందని చైనాలోని హెబేయ్‌ మెడికల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 4,318 మంది యువత, మధ్య వయసు వారిపై చేసిన అధ్యయనంలో వెల్లడైన వివరాలను తాజాగా బీఎమ్‌సీ జర్నల్‌లో ప్రచురించారు.

తొమ్మిది నెలల పాటు విశ్లేషణ 
ఈ శాస్త్రవేత్తలు 2023 జనవరి నుంచి సెప్టెంబరు వరకు మెడికల్‌ యూనివర్సిటీకి అను­బంధంగా ఉన్న హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్న 4,318 మంది యువకులు, మధ్య వయస్కుల ఆరోగ్య రికార్డులను విశ్లే­షించారు. 2,245 మంది పురుషులు, 1893 మంది స్త్రీలపై ఈ అధ్యయనం చేశారు. వారికి పలు రకాల పరీక్షలు నిర్వహించి, రాత్రిళ్లు నిద్రపోయే ముందు స్మార్ట్‌ ఫోన్లల్లో ఎంత సేపు రీల్స్, షార్ట్‌ వీడియోలు చూస్తున్నారనే అంశాన్ని పరిశీలించారు. 

రాత్రిళ్లు ఎక్కుసేపు రీల్స్, షార్ట్‌ వీడియోలు చూస్తూ గడిపే యువ­త, మధ్య వయసు వారిలో బీపీ బారినపడే ప్రమాదం పెరుగుతున్నట్లు నిర్ధారించారు. రీల్స్, షార్ట్‌ వీడియోలు చూసే సమయాన్ని వీలైనంత తగ్గించాలని, ఈ వ్యసనాన్ని పూర్తి­గా వీడితే మంచిదని సూచించారు. దీంతోపాటు శరీర బరువును అదుపులో పెట్టుకోవడం, రక్తంలో కొవ్వు, చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలని సూచించారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)