Breaking News

దేశంలో తృణధాన్యాల వినియోగం తగ్గుదల

Published on Sun, 06/16/2024 - 05:48

సాక్షి, అమరావతి: ప్రజలు తమ ఆదాయం పెరుగుతున్న కొద్ది ఆహార అలవాట్లలో మార్పులు చేసుకుంటూ వెళుతున్నారు. పాలు, మాంసం, గుడ్లు వంటి ఇతర ప్రొటీన్‌ ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా తృణధాన్యాల వినియోగం తగ్గుతోంది. గృహవినియోగ వ్యయ సర్వే 2022–23లో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 1999–2000 నుంచి 2022–23 మధ్య తృణధాన్యాల తలసరి విని­యోగం క్రమంగా క్షీణించింది. 1999–2000లో నెలవారీ తలసరి తృణధాన్యాల వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో 12.72, పట్టణ ప్రాంతాల్లో 10.42 కిలోలుగా ఉండేది. ఇది 2022–23లో గ్రామాల్లో 9.61, పట్టణాల్లో 8.05 కిలోలకు పడిపోయింది. 

పశ్చిమబెంగాల్‌లో అధికం
రాష్ట్రాల వారీగా తృణధాన్యాల వినియోగం పరిశీలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో 11.23 కిలోలతో పశ్చిమబెంగాల్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఒడిశా 11.21 కిలోలు, బీహార్‌ 11.14 కిలోలు, ఛత్తీస్‌గఢ్‌ 10.27 కిలోలతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అదే పట్టణ ప్రాంతాల్లో వినియోగం బిహార్‌లో 10.45 కిలోలు, ఛత్తీస్‌గఢ్‌లో 10.43, జార్ఖండ్‌లో 9.59 కిలోలు. గ్రామీణ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 9.30 కిలోలు, తెలంగాణలో 10.11,  పట్టణాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 8.29, తెలంగాణలో 8.77 కిలోల చొప్పున వినియోగిస్తున్నారు. 

బియ్యానిదే పైచేయి
మొత్తం తృణధాన్యాల వినియోగంలో బియ్యం వాటా ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా గ్రామాల్లో 9.61 కిలోల నెలవారీ తలసరి వినియోగంలో 55.35 శాతం బియ్యం, 40.93 శాతం గోధుమ, 3.48 శాతం ముతక, 0.22 శాతం ఇతర తృణధాన్యాలు ఉన్నాయి. పట్టణాల్లో 8.05 కిలోల నెలవారీ తలసరి వినియోగంలో 53.20 శాతం బియ్యం, 44.53 శాతం గోధుమ, 2.09 శాతం ముతక, 0.19 ఇతర తృణధాన్యాలు ఉన్నాయి. ఏపీలోని వినియోగిస్తున్న మొత్తం తృణధాన్యాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 92.22 శాతం, పట్టణాల్లో 90.55 శాతం బియ్యం వాటా నమోదైంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)