Breaking News

‘విద్యుత్’ధర్మానికి బాబు సర్కారు తూట్లు

Published on Sat, 01/24/2026 - 05:21

సాక్షి, అమరావతి: ‘‘ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)కి ఓ రాష్ట్ర హైకోర్టుకు ఉన్నంత అధికారం ఉంటుంది. కానీ బాబు సర్కారు ఏపీఈఆర్‌సీ విద్యుక్తధర్మానికి తూట్లు పొడిచింది. స్వతంత్ర అధికారాలకు మంగళం పాడింది. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేకుండా చేసింది’’ అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

2026–27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ తూ­ర్పు(ఏపీఈపీడీసీఎల్‌),మధ్య(ఏపీసీపీడీసీఎల్‌), దక్షిణ(ఏపీఎస్పీడీసీఎల్‌) విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు సమర్పించిన ఆదాయ, అవస­రాల నివేదిక (ఆగ్రిగేట్‌ రెవెన్యూ రిక్వైర్‌మెంట్‌–ఏఆర్‌ఆర్‌), రిటైల్‌ టారిఫ్‌ ప్రతిపాదనలపై ఏపీఈఆర్‌సీ శుక్రవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బహిరంగ విచారణ నిర్వహించింది. వివిధ వర్గాల ప్రజల నుంచి ఏపీఈఆర్‌సీ సభ్యుడైన పీవీఆర్‌ రెడ్డి, ఇన్‌చార్జ్‌ చైర్మన్‌ హోదాలో అభిప్రాయాలను స్వీకరించారు. 

లేఖలిస్తే సరా..డబ్బులివ్వరా
ప్రభుత్వం విద్యుత్‌ సంస్థలకు ఇవ్వాల్సిన సబ్సిడీ సొమ్ము 2025 సెప్టెంబర్‌ నాటికి రూ.12,718 కోట్లు ఉందని, పూర్తిగా డిస్కంలకు సర్కారు చెల్లించడం లేదని విద్యుత్‌ వినియోగదారుల ఐక్య వేదిక కన్వీనర్‌ ఎంవీ ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా రూ.4,495 కోట్లు కూడా సబ్సిడీ బకాయిలకు కలిశాయని పేర్కొన్నారు. 

ప్రభుత్వం లేఖ ఇస్తే సరిపోదని, డబ్బులూ సకాలంలో ఇవ్వాలని, అలా ఇవ్వకపోవడం వల్ల డిస్కంలు అప్పుల పాలవుతున్నాయన్నారు. దీనికి తోడు బిల్లుల బకాయిల రూ.15137 కోట్లు 2025 మార్చినాటికి ఉన్నాయన్నారు. ఇందులో ప్రైవేటు సంస్థలవి రూ.6,288 కోట్లు కాగా, మిగిలినవి ప్రభుత్వ సంస్థలవేనని విమర్శించారు. 

ఇచ్చిన హామీలు నిలబెట్టుకోని చంద్రబాబు, లోకేశ్‌
సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచం, తగ్గిస్తాం అని హామీ ఇచ్చారని, కానీ గడిచిన 18 నెలల్లో భారీగా చార్జీలు పెంచారని సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు విమర్శించారు. అదే విధంగా స్మార్ట్‌ మీటర్లు పెడతామని ఎవరైనా వస్తే పగలగొట్టాలని చెప్పిన మంత్రి లోకేశ్‌ ఇప్పుడు బలవంతంగా మీటర్లు పెట్టిస్తున్నా.. నోరు మెదపరేమని దుయ్యబట్టారు. 

విద్యుత్‌ బిల్లులోని క్యూఆర్‌కోడ్‌ పనిచేయడం లేదని, అడ్డగోలు చార్జీలతో ప్రజల నడ్డి విరుస్తున్నారని పలువురు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ అధికారులు  వేధిస్తున్నారని పారి­శ్రా­మి­కవేత్తలు ఫిర్యాదు చేశారు.  

ఆ చార్జీలను తొలగించాలి 
ఇక శుక్రవారం మ«­ద్యాహ్నం నుంచి ఆన్‌లైన్‌ (వర్చువల్‌) విధానంలో ప్రజా­భిప్రా­యసేకరణ జరిగింది. ట్రూ అప్‌ చార్జీలు, డెవలప్‌మెంట్‌ చార్జీలను తొలగించాలని, విద్యుత్‌ అధికారులు, విని­యో­గదారులకు సమన్వయ సమా­వేశాలను ప్రతి నెలా నిర్వహించాలని పలువురు విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో డిస్కంల సీఎండీలు పి.పుల్లారెడ్డి, శివశంకర్‌ లోతేటి, ఏపీఈఆర్‌సీ జాయింట్‌ డైరెక్టర్‌ డి.రమణయ్యశెట్టి, కార్యదర్శి పి.కృష్ణ, విద్యుత్‌ సంస్థల డైరెక్టర్లు, సీ­జీఎంలు ఉన్నతాధికారులు పాల్గొ­న్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 27న కర్నూ­లులో ప్రజాభిప్రాయసేకరణ జరగనుంది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)