Breaking News

ఇంటి పన్ను కడితేనే పింఛన్‌!

Published on Wed, 01/01/2025 - 03:42

గుడిపాల: ఇంటి పన్నుకు, పింఛన్లకు కూటమి సర్కారు ముడి పెడుతోంది. ఇంటి పన్ను కడితేనే పింఛన్లు ఇస్తామని సచివా­లయ సిబ్బంది హుకుం జారీ చేశారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో మంగళవారం 27 పంచాయతీల్లో ఇదే తంతు నడిచింది. పైనుంచి ఆదేశాలొచ్చాయంటూ..సచివాలయాల సిబ్బంది, వీఆర్‌ఓలు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఇంటి పన్ను వసూలు చేశా­రు. 

 కొన్ని గ్రామాల్లో ఇంటి పన్ను చెల్లిస్తామని చెప్పిన తర్వాతే పింఛన్‌ సొమ్ము అందజేశారు. అయితే పన్ను చెల్లించిన వారికి ఎక్కడా కూడా రశీదులు ఇవ్వలేదు.  ఇదివరకు ఎప్పు­డూ ఇలా చేయలేదని, ఇలా బలవంతం చేయడం తగదని లబ్ధిదా­రులు ఆవేదన వ్యక్తం చేశారు. 

‘పింఛన్‌ డబ్బులిచ్చేటప్పు­డే ఇంటి పన్ను వసూలు చేయండి. తర్వాత అయితే డబ్బులు లేవు అని చెబుతారు. ఇప్పుడైతే డబ్బులు లేవు అని చెప్పడానికి వారికి ఆస్కారం ఉండదు. ఇది ఇయర్‌ ఎండింగ్‌ అని చెప్పండి’ అని ఒక ప్రజాప్రతినిధి అధికారులకు దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. అయితే ఈ విషయమై స్పందించడానికి అధికారులెవరూ ఇష్టపడలేదు.

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)