Breaking News

రేయ్‌ ఇటురారా?

Published on Wed, 08/21/2024 - 08:43

గూడూరు రూరల్‌: ‘ఒరేయ్‌.. ఇటు రారా. ఏందిరా ఇది.. ఇంత అవినీతి ఎప్పుడైనా జరిగిందా.. ఎందుకిలా చేస్తున్నార్రా.. ఒరేయ్‌ మీకు అర్థం కావడం లేదురా..’ ఇదీ మంగళవారం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జరిగిన సమాజిక బహిరంగ సభావేదికలో ఉపాధి సిబ్బందినుద్దేసించి పీడీ శ్రీనివాసప్రసాద్‌ అన్న మాటలు. 

తమ తోటి సిబ్బందితో మర్యాదగా మసులుకోవాల్సిన ఆయన ఏకవచనంతో పిలుస్తూ అవమానాలకు గురిచేస్తుండడంపై పలువురు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగులమనే గౌరవం కూడా లేకుండా రారా..పోరా.. అని సంబోధించడం ఏంటని ప్రశి్నస్తున్నారు. ఎంతకాదన్నా తాముకూడా సహోద్యోగులమేకదా అని చెబుతున్నారు. ఎలాగంటే అలా మాట్లాడడం సరికాదని హితవు పలుకుతున్నారు. 

కాగా వివిధ గ్రామాలకు సంబంధించిన నలుగురు క్షేత్ర సహాయకులతోపాటు ఇద్దరు టెక్నికల్‌ అసిస్టెంట్లను తొలగిస్తున్నట్టు పీడీ పేర్కొన్నారు. వీరి నుంచి రూ.6.77 లక్షల రికవరీకి ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన వెల్లడించారు. ఇందులో మంగళపూరు, రామలింగాపురం, వెడిచెర్ల, కొండాగుంట గ్రామాల క్షేత్రసహాయకులు ఉన్నారని చెప్పారు. అలాగే విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించని ఇద్దరు టెక్నికల్‌ అసిస్టెంట్లను సస్పెండ్‌ చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఏపీడీ వరప్రసాద్, ఏపీఓ పెంచలయ్య, పలువురు టెక్నికల్‌ అసిస్టెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)