‘పట్టిసీమ’ పైప్‌లైన్‌ లీక్‌

Published on Sat, 07/06/2024 - 05:38

పోలవరం రూరల్‌: పట్టిసీమ ఎత్తిపోతల పథకం పైప్‌లైన్‌ లీకై 20 అడుగుల మేర నీరు ఎగసిపడింది. సమీపంలోని పొలాల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. యథావిధిగా శుక్రవారం పట్టిసీమ ఎత్తిపోతల పథకం మోటార్లు ఆన్‌ చేసి కుడి కాలువలోకి నీరు విడుదల చేశారు. అయితే మార్గమధ్యంలో చీకడోడిమెట్ట ప్రాంతంలో భారీగా నీరు లీకై పొలాల్లోకి చేరుతోంది. రైతులు ఇచ్చిన సమాచారం మేరకు పట్టిసీమ ఇంజనీరింగ్‌ అధికారులు మోటార్‌లను నిలిపివేసి పైప్‌లైన్‌ పరిస్థితిని పరిశీలించారు. 

చీకడోడిమెట్ట ప్రాంతంలో ఎయిర్‌ వాల్‌ ప్లేట్‌ లేకపోవడంతో నీరు ఎగసిపడినట్టు గుర్తించి మరమ్మతులు చేశారు. అనంతరం నీటి విడుదలను పునరుద్ధరించారు. గతంలో పైప్‌లైన్‌ ఎయిర్‌ వాల్‌ ప్లేట్‌ను తొలగించి రైతులు సాగునీటిని వినియోగించుకున్నారని, ఆ తర్వాత ప్లేట్‌ సరిగా బిగించకపోవడం వల్ల నీటి ఒత్తిడికి అది ఎగిరిపోయి నీరు ఎగసిపడినట్టు డీఈ ఆర్‌.పెద్దిరాజు తెలిపారు. 

కాగా, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ నెల రెండో తేదీన పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి హడావుడిగా కుడి కాలువకు నీటిని విడుదల చేశారని, పైప్‌లైన్‌ను పూర్తిగా పరిశీలించి మరమ్మతులు చేపట్టే అవకాశం కూడా ఇవ్వలేదని పలువురు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)