Breaking News

ఈ గుడ్డు చాలా కాస్ట్‌లీ.. ధ‌ర రూ.700 మాత్ర‌మే!

Published on Tue, 01/07/2025 - 05:28

కోడిగుడ్డు రూ.400 నుంచి రూ.700 ధర పలుకుతోంది. ఏంటీ కోడిగుడ్డుకు ఇంత ధరా. ఏమిటీ దీని స్పెషాలిటీ అనుకుంటున్నారా? ఇవి అలాంటి.. ఇలాంటి గుడ్లు కాదండోయ్‌. ఈ గుడ్లు వెరీ స్పెషల్‌. సంక్రాంతి సంబరాల్లో పౌరుషాన్ని చాటి.. పందేలరాయుళ్లకు కాసుల వర్షాన్ని కురిపించే పందెం కోళ్ల జాతికి సంబంధించిన గుడ్లకు భారీ ధర పలుకుతోంది. కోస్తా జిల్లాల నుంచి వీటిని తీసుకొచ్చి ప్రకాశం జిల్లా (Prakasam District) తీరంలోని కొత్తపట్నం, సింగరాయకొండ (Singarayakonda) మండలాల్లో పెంచుతున్నారు. వీటి గుడ్లను జాతి పెట్టలతో పొదిగించి.. పుంజులను ప్రత్యేకంగా సంరక్షిస్తున్నారు.  –సాక్షి ప్రతినిధి, ఒంగోలు

గుడ్డు రకాన్ని బట్టి ధర
పందెం కోడి కోళ్లలో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా తూర్పు కోడి, పెర్విన్‌ కోడి, భీమవరం కోడి, ఎర్ర మైల, అబ్రాసు మైల, కాకి నెమలి, తెల్ల నెమలి, నల్లపడ కోడి, కాకి డేగ, ఎర్ర కక్కెర, తెల్లకోడి, కాకి నెమలి, పెట్టమారు వంటి పుంజులు ఈ జాబితాలో ఉన్నాయి. రకాన్ని బట్టి గుడ్డు ధరలు పలుకుతున్నాయి. ఒక్కో గుడ్డు (Egg) రూ.400 నుంచి రూ.700 వరకూ విక్రయిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి వీటి ధరలు కూడా పెరిగిపోతుంటాయి. తూర్పు కోడి, భీమవరం కోడి, ఎర్ర కక్కెర, తెల్లకోడి పెట్టిన ఒక్కో గుడ్డు ధర సుమారు రూ.400 వరకు ఉంటుంది.

క్రాస్‌ బ్రీడ్‌లైన అబ్రాసు మైల, తెల్ల కక్కెర, ఎర్ర మైల తదితర రకాల జాతులకు చెందిన గుడ్డు ఒక్కొక్కటీ రూ.500 నుంచి రూ.700 వరకు ఉంటుంది. పందెం కోడి రకం గుడ్ల కోసం ప్రత్యేకంగా పెంచిన నల్ల పెట్ట, డేగ పెట్ట, తెల్ల పెట్ట, బూడిదరంగు పెట్ట, అబ్రాసు పెట్ట, కక్కెర పెట్టలను ఉపయోగిస్తారు. పందెం కోళ్లతో ఈ పెట్టలు కలవటం ద్వారా గుడ్లు పెడతాయి. ఈ కోళ్లు గుడ్లు పెట్టడమే కానీ.. వాటిని పొదగవు. ఈ కోళ్లు మూడు నెలల్లో 10 నుంచి 15 వరకు గుడ్లను పెడతాయి. ఈ గుడ్లను ప్రత్యేక నాటుకోళ్లతో పొదిగిస్తారు. వీటికి బహిరంగ మార్కెట్‌లో చాలా డిమాండ్‌ ఉంటుంది.

ప్రత్యేక ఆహారం
పందెం కోళ్ల పెంపకంలో ప్రత్యేక ఆహారం పెడతారు. కోడి గుడ్డు పెట్టిన తరువాత మూడు వారాలకు పిల్ల అవుతుంది. అప్పటి నుంచి రెండేళ్లపాటు వాటికి ప్రత్యేక ఆహారం పెడతారు. సుమారు ఏడాదిన్నర పాటు రాగులు, సజ్జలు పెడతారు. తరువాత 6 నెలలు బాదం, ఖర్జూరం, అంజూర్, యాలుక, రసగుల్లా, రంగుల ద్రాక్ష, కిస్మిస్, నాటుకోడి గుడ్డు వంటి బలవర్ధకమైన ఆహారాన్ని పెడతారు. కొన్నింటికి పోతు మాంసం కూడా పెడతారు. దీనిని తినడం ద్వారా పుంజు బలంగా ఉండటమే కాక బరిలో అవతలి పుంజును సమర్థవంతంగా ఎదుర్కొంటుందని పెంపకందారులు చెబుతున్నారు

కుటీర పరిశ్రమగా పందెం కోళ్ల పెంపకం
పందెం కోళ్లను కొత్తపట్నం, సింగరాయకొండ మండలాల్లోని తీరప్రాంత గ్రామాల్లో కుటీర పరిశ్రమగా పెంచుతున్నారు. కొంతమంది కోడిగుడ్లను అమ్ము కుంటూ ఆదాయం పొందుతుండగా.. మరికొందరు గుడ్లను పొదిగించి వాటిని అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఇంకొందరు వాటిని బరిలో దిగేలా పెంచి అధిక ధరలకు అమ్ముతున్నారు. కోడి పుంజుల పెంపకం లాభసాటిగా ఉందని.. దూరప్రాంతాల నుంచి వచ్చి పుంజులను కొనుగోలు చేస్తుంటారని పెంపకందారులు వివరించారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)