Breaking News

కూటమి ప్రభుత్వానికి షాక్‌.. టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ అభ్యర్థి ఓటమి

Published on Mon, 03/03/2025 - 19:03

సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి భారీ షాక్‌ తగిలింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీనివాసుల నాయుడు గెలుపొందారు. కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఓడిపోయారు. దీంతో ఓటమిని అంగీకరిస్తూ రఘువర్మ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చేశారు. ఓడిపోయినప్పటికీ టీచర్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.  

ప్రభుత్వంపై ప్రభుత్వ టీచర్ల వ్యతిరేకత
ఉత్తరాంధ్ర టీచర్‌ ఎన్నికల ఫలితాలతో 9 నెలలకే ప్రభుత్వంపై టీచర్ల వ్యతిరేకత సుస్పష్టమైంది. ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తిరుగుబాటు ప్రకటించారు. అందుకు ఊతం ఇచ్చేలా ఉత్తరాంధ్ర టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ టీచర్లు కూటమికి ఓటమి రుచి చూపించారు. టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘు వర్మను ఓడించారు. పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడిని గెలిపించారు. 

చంద్రబాబుకు ఓటమి రుచి చూపించిన ప్రభుత్వ టీచర్లు
రఘువర్మను కూటమి అభ్యర్థిగా టీడీపీ, జనసేన,బీజేపీలు  పోటీకి పెట్టాయి. తొలి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యతలోనూ కూటమి అభ్యర్థి వెనకపడ్డారు. బ్యాలెట్ ఓటింగ్‌లో కూటమి పార్టీ అభ్యర్థికి భంగపాటు ఎదురైంది. దీంతో చరిత్రలో ఏ ప్రభుత్వానికి ఎదురుకాని చేదు అనుభవం కూటమి ప్రభుత్వానికి ఎదురైంది. ఎన్నికల్లో గెలిచాక ఉద్యోగులు, ఉపాధ్యాయులను ప్రభుత్వం మోసం చేసింది. ఉద్యోగులకు కనీసం ఒక్క డీఏ ఇవ్వలేదు. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఊసెత్తలేదు. దీంతో ప్రభుత్వ టీచర్లలో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది. ఫలితంగా ఉత్తరాంధ్ర టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు ఓటమి అనివార్యమైంది. 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)