Breaking News

కోలుకుంటున్న బస్సు ప్రమాద బాధితులు 

Published on Tue, 08/22/2023 - 04:30

సాక్షి, పాడేరు: పాడేరు ఘాట్‌ లోయలో ఆర్టీసీ బస్సు దూసుకుపోయిన ఘటనలో గాయపడిన ప్రయాణికులు కోలుకుంటున్నారు. పాడేరు జిల్లా ఆస్పత్రిలో 21 మందికి నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన సేవలందుతున్నాయి. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న­దొర, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుడివాడ అమర్‌­నాథ్‌లు.. కలెక్టర్, ఇతర వైద్య శాఖ అధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు.

ఆర్టీసీ విజయనగరం జోనల్‌ చైర్‌పర్సన్‌ గదల బంగారమ్మ, ఆర్టీసీ డిప్యూటీ చీఫ్‌ మెకానికల్‌ ఇంజినీర్‌ కణితి వెంకటరావులు ఆస్పత్రికి వెళ్లి బాధిత ప్రయాణికులను పరామర్శించారు. తీవ్ర గాయాలపాలైన బోడిరాజు, చిన్నమ్మలకు విశాఖలోని మెడికవర్‌ ఆస్పత్రిలో ఉన్నత వైద్య సేవలు అందడంతో ప్రాణాపాయం తప్పిందని పాడేరు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కృష్ణారావు చెప్పారు.

మెడికవర్‌ ఆస్పత్రిలో బాధితులను రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ శంకరరావు సోమవారం పరామర్శించారు. ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆయన తెలిపారు. ఆయా ఆస్పత్రుల్లో బాధితులకు అందిస్తున్న వైద్య సేవలు, పౌష్టికాహారం, ఇతర సహా­యక చర్యలపై ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి కలెక్టర్‌ సుమిత్‌కుమార్, ఇతర అధికారులు నివే­దికలు పంపుతున్నారు. ప్రయాణికులు కొండన్న, నారాయణమ్మల మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)