ఉద్యోగులకు ఉద్వాసన

Published on Sun, 11/24/2024 - 04:59

సాక్షి, అమరావతి: యువతకు 20 లక్షల ఉద్యో­గాలు ఇస్తామని నమ్మబలికి అధి­కారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఆ ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగులపై పగబట్టి భారీగా తొలగింపుల పర్వానికి తెరలేపింది. కూటమి ప్రభు­త్వం వచ్చిన తర్వాత ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)లో ఇప్పటివరకు విడతల వారీగా 400 మందికిపైగా అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగు­లను తొలగించింది. గడచిన మూడు రోజు­ల్లోనే సుమారు 200 మందిని ఉన్నట్టుండి తొలగిస్తూ ఎండీ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశాలిచ్చారు.

ఏపీఎండీసీ ప్రధాన కార్యాలయం, అన్నమయ్య జిల్లాలోని మంగంపేట బెరైటీస్‌ ప్రాజెక్టు, ప్రకాశం జిల్లా చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్‌ ప్రాజెక్టులో పని­చేసే చిరుద్యోగులపై రాజకీయ ముద్రవేసి మరీ ప్రభుత్వం పక్కనపెట్టింది. 20వ తేదీన సుమారు 90 మంది అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల సేవలు అవసరం లేదని ఎండీ ఆదేశాలిచ్చారు. అంత­కుముందు 18వ తేదీన సుమారు వంద మందికిపైగా అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగు­లను తొలగిస్తూ ఆదేశాలిచ్చారు. వీరిలో ఎక్కువ­మంది మంగంపేట బెరైటీస్‌ ప్రాజెక్టులో పనిచేస్తు­న్నారు.

ఆ తర్వాత విజయవాడలోని ఏపీఎండీసీ ప్రధాన కార్యాలయం, చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్‌ ప్రాజెక్టులో పనిచేసేవారు ఉన్నారు. గత ప్రభు­త్వంలో నియమించారనే కారణం చూపి వారందరినీ ఉన్న ఫళాన వెళ్లగొట్టారు. అంతకుముందు మరో 200 మందిలో సగం మందికి కాంట్రాక్టు ముగియడంతో పొడిగించకుండా బయటకు పంపారు. కాంట్రాక్టు ఇంకా మిగిలి ఉన్న వారిని సైతం ఏదో ఒక సాకు చూపి తొలగించారు. తొలగింపునకు గురైన వారిలో ఎక్కువ మంది అటెండర్లు, డ్రైవర్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, ఆఫీస్‌ అసిస్టెంట్లు ఉన్నారు. విజయవాడ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల్లో డీఈఓలు, డీపీఓలు, ఇతర క్యాడర్‌ ఉద్యోగులున్నారు. గత ప్రభుత్వంలో నియమితులైన వారే కాకుండా పదేళ్ల నుంచి పనిచేస్తున్న వారిని కూడా అన్యాయంగా తొలగించినట్టు తెలుస్తోంది.

నిబంధనలకు విరుద్ధం
అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఏ కారణం లేకుండా తొలగించకూడదనే నిబంధనలు ఉన్నా ఉన్న­తా­ధికారులు లెక్క చేయలేదు. వారందరినీ నిబంధనల ప్రకారమే నోటిఫికేషన్‌ ఇచ్చి, ఇంటర్వ్యూ నిర్వహించి నియమించారు. కార్యాలయంలోనూ, సంబంధిత ప్రాజెక్టుల్లోనూ అవసరాన్ని బట్టి ఈ నియామకాలు జరిపినట్టు ఉద్యోగులు చెబుతు­న్నారు. కానీ సహేతుకమైన కారణం లేకుండానే రాజకీయ కోణంలో అందరినీ ఒకేసారి పక్కన­పెట్టేయడంతో వారంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఉద్యోగం తీసే­స్తే తమ కుటుంబాలు ఏం కావాలని వాపోతున్నారు.

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)