Breaking News

ఔట్‌సోర్సింగ్‌ టీచర్లకు బుజ్జగింపు

Published on Wed, 10/15/2025 - 05:39

సాక్షి, అమరావతి: వారం రోజులు సమయమిస్తే... ఏదో రకంగా సర్దుబాటు చేస్తామంటూ గిరిజన ఔట్‌సోర్సింగ్‌ టీచర్లను గిరిజన సంక్షేమ శాఖ అధికారులు సముదాయించారు. రాష్ట్రంలోని 191 గిరిజన గురుకులాల్లో డీఎస్సీ ద్వారా రెగ్యులర్‌ ఉపాధ్యాయులు సోమవారం విధుల్లోకి చేరడంతో ఆ పోస్టుల్లో ఇప్పటి వరకు పనిచేస్తున్న 1,143 మంది ఔట్‌సోర్సింగ్‌ టీచర్లు రోడ్డున పడ్డ విష­యం తెలిసిందే. ఉద్యోగాలు లేకుండా తమ కు­టుంబాలను రోడ్డున పడేయొద్దని ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి మొరపెట్టుకున్న టీచర్లు, మంగళవారం ఉన్నతాధికారులను కలిశారు. 

గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎంఎం నాయక్, గురుకులాల సంస్థ కార్యదర్శి గౌతమితో వేర్వేరుగా చర్చలు జరిపా­రు. గిరిజన ఔట్‌సోర్సింగ్‌ టీచర్ల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనాయక్, ప్రధాన కార్యదర్శి మల్లిఖార్జున నాయక్‌ నేతృత్వంలో 26 జిల్లాల ప్రతినిధి బృందం అధికారులతో గోడు వెళ్లబోసుకున్నారు. మంజూరైన పోస్టుల్లో రెగ్యులర్‌ ఉపాధ్యాయులు విధుల్లో చేరినందున ఔట్‌సోర్సింగ్‌ టీచర్లను ఎలా సర్దుబాటు చేయాలనేది ఆలోచిస్తున్నామని ఎంఎం నాయక్‌ తెలిపారు. 

ఔట్‌సో­ర్సింగ్‌ పోస్టుల విషయంలో ఆర్థిక శాఖ అనుమతి తీసుకుంటామని, జీతాల పెంపు లేదు కాబట్టి అను­మ­తి సమస్య ఉండదంటూ వారిని సముదాయించా­రు. ఈ విషయంలో ప్రభుత్వానికి వారం వెసులుబాటు ఇస్తే సర్దుబాటుకు చర్యలు తీసుకుంటామ­ని నాయక్‌ చెప్పినట్లు సమాచారం. దీనికి అంగీకరించిన ఔట్‌సోర్సింగ్‌ టీచర్లు బుధవారం తలపెట్టిన ఆందోళన కార్యాచరణ సమావేశాన్ని వా­యి­దా వేస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)