Breaking News

చేనేత శంఖారావానికి సన్నాహాలు

Published on Sun, 01/26/2025 - 05:08

సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి చూపుతున్న చేనేత రంగం తన ఉనికిని చాటుకునేందుకు శంఖారావం పూరిస్తోంది. తమ వర్గానికి తగిన ప్రాధాన్యత దక్కకపోవడంతో పోరుబాట పడుతోంది. రాజకీయంగా తమకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో.. చేనేత కులాలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యతను సాధించేందుకు ఆలిండియా వీవర్స్‌ ఫెడరేషన్‌ నడుం బిగించింది. రాజకీయంగా బలపడేందుకు.. అసెంబ్లీ స్థానాల్లో తమ వాటా కోసం రాష్ట్రంలోని చేనేత కులాలను ఫెడరేషన్‌ ఏకం చేస్తోంది. 

రాష్ట్రంలో మొత్తం 18 చేనేత కులాలు..
దేశంలో చేనేత వృత్తి పైనే జీవించే కులాలు అనేకం ఉన్నాయి. వాటిలో పద్మశాలి, దేవాంగ, జాండ్ర, పట్టుసాలి, తొగటవీర క్షత్రియ, స్వకులశాలి, కుర్తీన సెట్టి (కుర్తి) (నెస్సీ), సేనాపతులు, కైకాల, కర్ణభక్తులు, కరికాల భక్తులు, సాధనా సూరులు, బావసార క్షత్రియ, ఖత్రి, నీలి, నీలకంఠి, కోస్టి, ముదలియార్‌ వంటి 18 చేనేత కులాలు రాష్ట్రంలో ఉన్నాయి. వీటిలో చాలావరకు అత్యంత వెనుకబడిన కులాల (ఎంబీసీ) జాబితాలో ఉన్నాయి. 

ఇక అధికారిక, అనధికార లెక్కల ప్రకారం ఏపీలో దాదాపు 10లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నట్లు ఓ అంచనా. అలాగే, ఈ వర్గం తరఫున అసెంబ్లీలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ ఒక్కరే ఎమ్మెల్యేగా ఉన్నారు. 

చేనేత వృత్తికి సంబంధించిన నూలు, సిల్క్, రంగులు, రసాయనాలు, ముడిసరుకుల ధరలు, చేనేత ఉత్పత్తులు, అమ్మకాలు, ఎగుమతులు, పన్నులు, సబ్సిడీలు, ఇతర సౌకర్యాలు, వంటి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిసారించడంలేదని ‘చేనేత’ వర్గాలు ఆరోపి­స్తున్నాయి. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలోని చేనేత కార్మికుల స్థితిగ­తులను, వృత్తిపరంగా ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు వారు శంఖారావం పూరించనున్నారు.

ఒకే వేదికపైకి చేనేత కులాలు..
ఇక దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ఏర్పడిన ఆలిండియా వీవర్స్‌ ఫెడరేషన్‌ తమ సమస్యల సాధన కోసం అన్ని చేనేత కులాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఇప్పటికే గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇటీవల 18 కులాలలోని ముఖ్యులు సమావేశమయ్యారు. ఇందులో చేనేత వర్గానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల నేతలు, ఆయా కులాల పెద్దలు పాల్గొన్నారు. 

రాజకీయంగా తమకు రావాల్సిన వాటాను రాబట్టుకోవాలని.. రాష్ట్రంలోని చేనేత కులాలతోపాటు, చేనేత సంఘాలను కూడా కలుపుకుపోవాలని వారు నిర్ణయించారు. రాష్ట్రంలో 45 శాసనసభ నియోజకవర్గాల్లో గెలుపుపై ప్రభావం చూపగల స్థాయిలో చేనేత కులాలు ఉన్నందున రాష్ట్రస్థాయిలో భారీఎత్తున చేనేత శంఖారావం సభ నిర్వహించాలని సంకల్పించారు. 

ఈ విషయమై ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2 ఆదివారం కృష్ణాజిల్లా గన్నవరంలో చేనేత కులాలకు చెందిన పలువురు ముఖ్యులు సమావేశం కావాలని నిర్ణయించారు. ఇందులో శంఖారావంపై నిర్ణయం తీసుకోనున్నారు.  

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు