Breaking News

రూ.1,600 కోట్లతో ‘మాండలీజ్‌ చాక్లెట్స్‌’ విస్తరణ 

Published on Thu, 07/27/2023 - 04:48

సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్‌ తయారీ సంస్థ మాండలీజ్‌ రాష్ట్రంలో భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. శ్రీసిటీలో ఇప్పటికే రూ.2,078 కోట్లతో 133 ఎకరాల విస్తీర్ణంలో ప్లాంట్‌ ఏర్పాటు చేసిన మాండలీజ్‌.. ఆ యూనిట్‌లోనే రూ.1,600 కోట్లతో విస్తరణ చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ విస్తరణ ద్వారా 57 వేల చదరపు మీటర్ల మేర అభివృద్ధి చేయనున్నామని, తద్వారా ఏటా 2.20 లక్షల టన్నుల కోకోను వినియోగించుకునే సామర్థ్యం వస్తుందని మాండలీజ్‌ ఇండియా సప్లై చైన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వెంకట్‌ మానేపల్లి తెలిపారు.  

కొత్తగా మూడు ఉత్పత్తి లైన్లు 
విస్తరణలో భాగంగా కొత్తగా మూడు ఉత్పత్తి లైన్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఈ యూనిట్‌లో 400 మంది పనిచేస్తుండగా.. విస్తరణ తర్వాత ఉపాధి లభించే వారి సంఖ్య 973కు చేరనుంది. అలాగే.. ఈ యూనిట్‌ ద్వారా 18 వేల మంది కోకో రైతులకు ప్రయోజనం లభించనుందని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మూడు సంవత్సరాల్లో ఈ విస్తరణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

ఈ సందర్భంగా వెంకట్‌ మానేపల్లి మాట్లాడుతూ.. ‘భారతదేశంలో 75 సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్థగా మా వృద్ధికి అనుగుణంగా దేశంలో పెట్టుబడులు పెట్ట­డం కొనసాగించటం పట్ల సంతోషంగా ఉన్నాం. కీలకమైన శ్రీ సిటీ తయారీ యూనిట్‌ కార్యకలాపాలను విస్తరిస్తూ పెట్టుబడులు పెట్టడం ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిరంతరం అందిస్తున్న  సహకారానికి  కృతజ్ఞతలు. రాష్ట్రంలో మరిన్ని విజయాలను నమోదు చేస్తాం’ అని పేర్కొన్నారు. మాండలీజ్‌ శ్రీసిటీ యూనిట్‌ ద్వారా క్యాడ్‌బరీ, బార్నొవిటీ, ఓరియో వంటి బ్రాండ్స్‌కు చెందిన చాక్లెట్లు, కన్ఫెక్షనరీ ఉత్పత్తులను అందిస్తోంది.   

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)