Breaking News

‘నీవు వచ్చేంత వరకూ ఇక్కడే ఉంటా తల్లీ’

Published on Sat, 04/26/2025 - 12:21

అనంతపురం: ఉదయం నిద్రలేవగానే ఏదో తెలియని అలజడి.. గుండెను ఎవరో మెలిక పెడుతున్నట్లుగా బాధ... అయినా మనువరాలి పరీక్ష కోసం అన్నీ ఓర్చుకున్నాడు. ఆటోలో పిలుచుకొచ్చి ‘నీవు వచ్చేంత వరకూ ఇక్కడే ఉంటా తల్లీ’ అంటూ పరీక్ష కేంద్రం వద్ద వదిలాడు. లోపల మనవరాలు పరీక్ష రాస్తుండగా బయట ఆటోలో గుండెపోటుతో మృతిచెందాడు. హృదయ విదారకమైన ఈ ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. వివరాలు... 

కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లికి చెందిన రైతు, మాజీ సర్పంచ్‌ బొజ్జన్న (65) శుక్రవారం ఉదయం తన మనవరాలు చంద్రకళను పిలుచుకుని ఏపీఆర్‌జేసీ పరీక్షలు రాయించేందుకు అద్దె ఆటోలో అనంతపురానికి చేరుకున్నారు. మధ్యాహ్నం పరీక్ష కేంద్రం వద్ద కాస్త నలతగా ఉండడం గమనించిన చంద్రకళ ‘తాతా ఏమైంది’ అంటూ అడగడంతో తనకేమీ కాలేదని నవ్వుతూ పరీక్ష రాసి వచ్చేంత వరకూ తాను అక్కడే ఉంటానని, బాగా రాయాలంటూ చెప్పి కేంద్రంలోకి పంపాడు. అనంతరం ఆటోలోనే సేదదీరుతూ గుండెపోటుకు గురై మృతి చెందాడు. 

పరీక్ష ముగిసిన తర్వాత బయటకు వచ్చిన చంద్రకళ నేరుగా ఆటో వద్దకు చేరుకుంది. తాత నిద్రిస్తున్నాడనుకుని లేపేందుకు ప్రయత్నించడంతో ఆయన సీటులోనే జారిపోయాడు. దీంతో మృతి చెందినట్లుగా నిర్ధారించుకుని బోరున విలపించింది. ‘నేను వచ్చేంత వరకూ ఇక్కడే ఉంటానని.. ఎక్కడికెళ్లావ్‌ తాతా..’ అంటూ ఆమె రోదించిన తీరు అందరినీ కంట తడి పెట్టించింది. స్థానికుడి ఫోన్‌ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన అనంతపురానికి చేరుకుని సాయంత్రానికి మృతదేహాన్ని తీసుకుని స్వగ్రామానికి చేరుకున్నారు.    

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)