Breaking News

‘స్టేటస్‌కో’ భూములకు అధికారుల కంచె

Published on Thu, 09/11/2025 - 05:41

తగరపువలస: ఓ హోటల్‌ కోసం హైకోర్టు స్టేటస్‌కో ఆదేశాలున్న భూముల్లో రెవెన్యూ అధికారులు పోలీసు బందోబస్తుతో బుధవారం జంగిల్‌ క్లియరెన్స్‌ చేయడంతోపాటు ఫెన్సింగ్‌ నిర్మాణం చేపట్టడంపై విశాఖ, విజయనగరం జిల్లాల రైతులు ఆందోళన చెందుతున్నారు. మే ఫెయిర్‌ హోటల్‌కు కూటమి సర్కారు కేటాయించిన భూముల్ని ఇచ్చేందుకు తిరస్కరించిన రైతులు గతంలోనే హైకోర్టును ఆశ్రయించి స్టేటస్‌కో ఉత్తర్వులు తీసుకున్నారు.  వి­శాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరం పంచా­యతీ సర్వే నెం.101/1లో బుధవారం భీమిలి రెవె­న్యూ అధికారులు 200 మంది కూలీలతో జంగిల్‌ క్లి­యరెన్స్‌తో పాటు ఫెన్సింగ్‌ నిర్మాణం చేపట్టారు. 

70 ఏళ్లకు పైగా ఈ భూములలో సరుగుడు, కొబ్బ­రి, నీలగిరి, జీడి తదితర తోటలు సాగు చేసుకుంటూ డీఆర్‌ నంబరు కలిగిన రైతులను అక్కడకు అనుమతించలేదు. విలేకరులను కూడా దూరం నుంచే పోలీసులు పంపించేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇదే సర్వే నంబరులో స్టార్‌ ఒబెరాయ్‌ గ్రూప్‌­నకు స్థలాలు కే­టాయించినప్పుడు రైతులకు ప్రతి­ఫలంగా ఎకరాకు 20 సెంట్లు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ఇదే సర్వే నంబరులో మే ఫెయిర్‌ హో­టల్‌కు 40 ఎకరాలు కేటాయించింది. అందుకుగాను రైతులకు ఎకరాకు 5 సెంట్లు మాత్రమే ఇస్తామనడంతో వారు అంగీకరించలేదు. 

జూన్‌లో ఈ భూములను స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన మే ఫెయర్‌ సిబ్బందిని రైతులు అడ్డుకున్నారు. అప్పట్లో భీమిలి తహసీల్దారు రామారావు ఫిర్యాదు మేరకు భీమిలి మండలం అన్నవరం పంచాయతీ, విజయనగరం జిల్లా భోగాపురం మండలం తూడెం పంచాయతీల­కు చెందిన రైతులపై పోలీసులు కేసు నమో­దు చేశా­రు. ఈ 40 ఎకరాల రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో వారికి స్టేటస్‌కో ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. హైకో­ర్టు ఈ పిటిషన్‌ను గురువారానికి వాయిదా వేసింది. 

పేదల కడుపుకొట్టి హోటల్‌కు భూములా? 
ఇందులో మా కుటుంబానికి ఎ.8.50 సెంట్లు ఉంది. ల్యాండ్‌ పూలింగ్‌కు అడిగినా ఇవ్వలేదు. హైకో­ర్టును ఆశ్రయించి జిల్లా అధికారులకు కూడా ఫిర్యాదు చేశాం. పేదల కడుపు కొట్టి ప్రభుత్వం హోటల్‌కు భూములు ఇస్తుంది. – దువ్వి అప్పన్న, తూడెం  

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)