Breaking News

వెలుగులోకి మరో ‘కౌంటింగ్‌’ మాయ

Published on Thu, 06/06/2024 - 04:59

అచ్చంపేట: ఎన్నికల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఈవీఎం మారిపోయిన సంఘటన ఇప్పటికే బయటపడగా, తాజాగా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఓ పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంలో నమోదైన ఓట్లను లెక్కించకుండానే అధికారులు పక్కన పడేసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఈ నియోజకవర్గంలోని అచ్చంపేట జెడ్పీ హైస్కూల్‌లో ఉన్న 56వ పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంలో ఓట్లను లెక్కించకుండానే అధికారులు పక్కన పెట్టేశారని కౌంటింగ్‌ ఏజెంట్లు తెలిపారు.

దీనిపై అధికారులను ప్రశ్నించగా, ఈవీఎంలో సాంకేతిక లోపం తలెత్తిందని, అది ఓపెన్‌ కావడంలేదని, అందువల్ల లెక్కింపు సాధ్యం కావడంలేదని చెప్పారని ఏజెంట్లు చెప్పారు. ఈ బూత్‌లో మొత్తం 737 ఓట్లు ఉన్నాయి. అందులో 357 మంది పురుషులు, 380 మంది మహిళలు ఉన్నారు. అచ్చంపేట మండలంలో 2019 ఎన్నికలలో వైఎస్సార్‌సీపీకి 7,597 ఓట్ల మెజార్టీ  వచ్చింది. ఈసారి టీడీపీకి ఈ మండలంలో 161 ఓట్ల మెజార్టీ వచ్చింది.

అయితే, 56వ పోలింగ్‌ బూత్‌లో ఓట్లను లెక్కించకుండానే టీడీపీకి 161 ఓట్ల మెజార్టీ వచ్చినట్లు అధికారులు ఎలా ధృవీకరిస్తారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిడి మేరకే అధికారులు ఈ విధంగా, చేశారని, వైఎస్సార్‌సీపీని దెబ్బ తీయడానికి ఇంకా బయటపడని ఘోరాలు ఇంకెన్ని జరిగాయోనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)