Breaking News

పెంకుటింటికి విద్యుత్‌ అధికారుల పరుగులు

Published on Sun, 01/12/2025 - 03:30

సాక్షి, పాడేరు: ‘పెంకుటింటికి భారీగా బిల్లు’ శీర్షికతో శనివారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో వచ్చిన కథనంతో విద్యుత్‌ అధికారులు పాత పాడేరు గ్రామానికి శనివారం ఉదయాన్నే పరుగులు పెట్టారు. కిల్లు బాబూరావుకు చెందిన పెంకుటింటిలోని మీటరుతో పాటు విద్యుత్‌ వినియోగాన్ని పరిశీలించారు. కుటుంబసభ్యులతో మాట్లాడి గత నెల, ఈ నెల వచి్చన విద్యుత్‌ బిల్లులను పరిశీలించారు. 

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాత మీటరును సీజ్‌ చేసి.. అనకాపల్లిలోని ట్రాన్స్‌కో ల్యాబ్‌కు పంపించారు. ఆ వెంటనే కొత్తగా మరో మీటరును అమర్చారు. ఈ విషయంపై పాడేరు ఏఈఈ ఎం.వెంకటరమణ మాట్లాడుతూ.. గత నెలలో మైనస్‌ రూ.1,496 బిల్లు వచ్చి.. ఈనెలలో ప్లస్‌లో రూ.69,314.91 బిల్లు రావడంపై సమగ్ర విచారణ చేస్తున్నామని చెప్పారు. 

పాత విద్యుత్‌ మీటరును అనకాపల్లిలోని ల్యాబ్‌కు పంపించామని తెలిపారు. అక్కడి పరిశీలన అనంతరం విద్యుత్‌ బిల్లు తగ్గింపు లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు.  

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)