Breaking News

పెళ్లైన విషయాన్ని దాచి యువతితో ఆస్పత్రి మేనేజర్‌ ప్రేమ

Published on Sat, 03/22/2025 - 11:05

మదనపల్లె: కుటుంబ పోషణ కోసం ఆస్పత్రిలో నర్సుగా చేరిన ఓ యువతిని ప్రేమ పేరుతో లొంగదీసుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రైవేట్‌ ఆస్పత్రి మేనేజర్‌తో పాటు బెదిరించినందుకు మరో ఇద్దరు వైద్యులపై గురువారం రాత్రి కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ ఎరీషావలీ తెలిపారు. కురబలకోట మండలం తెట్టు పంచాయతీ సింగన్నగారిపల్లెకు చెందిన ఓ యువతి (25) నర్సింగ్‌ పూర్తిచేసి ఉపాధి కోసం మదనపల్లె పట్టణం బెంగళూరురోడ్డులోని ఓ ఆస్పత్రిలో నర్సుగా చేరింది. అదే ఆస్పత్రిలో మేనేజర్‌గా పనిచేస్తున్న వివాహితుడైన రాజేష్​ రెడ్డి(30) ఆమెకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. 

వివాహం చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఇద్దరూ శారీరకంగా ఒకటయ్యారు. ఆమె గర్భవతి కాగా, మాయమాటలు చెప్పి తిరుపతికి తీసుకువెళ్లి గత ఏడాది ఆగస్టులో అబార్షన్‌ చేయించాడు. తర్వాత కొంతకాలానికి  రాజేష్‌రెడ్డి వివాహితుడనే విషయం తెలుసుకున్న యువతి తనకు ఎందుకు మోసం చేశావని నిలదీసింది. తనకు న్యాయం చేయాలని లేకపోతే చట్టపరంగా పోలీసులను ఆశ్రయిస్తానని ఖరాఖండిగా చెప్పింది. దీంతో పెద్దమనుషుల సహాయంతో పలుమార్లు పంచాయతీలు నిర్వహించి యువతికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆమె వినకపోగా, తనకు కచ్చితంగా న్యాయం జరగాల్సిందేనని లేకపోతే పోలీస్‌ కేసు పెడతానని చెప్పింది.

 దీంతో ఆస్పత్రి యజమాని, వైద్యుడైన రవికుమార్‌రెడ్డి ఆమెను నీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ ఉద్యోగంలో తొలగించి బయటకు పంపేశాడు. ఇ దే విషయంలో అంగళ్లుకు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు రా యుడు యువతిని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో తన కు న్యాయం జరగదని నిర్ధారించుకుని, బాధిత యువతి వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించింది. విచారించిన సీఐ ఎరీషావలీ, యువతిని మోసం చేసిన రాజేష్​ రెడ్డి, ఆస్పత్రి వైద్యులు రవికుమార్‌రెడ్డి, ఆర్‌ఎంపీ వైద్యుడు రాయుడులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.   

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)