Breaking News

ఏపీలో పెరుగుతున్న అమ్మాయిలు

Published on Mon, 09/30/2024 - 05:36

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అమ్మాయిల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏపీలోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అబ్బాయిల కన్నా అమ్మాయిలే అధికమని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ వెల్లడించింది. ఈ మేరకు లేబర్‌ ఫోర్స్‌ సర్వే నివేదికను కేంద్రం విడుదల చేసింది. 2023 జూలై నుంచి 2024 జూన్‌ వరకు ఈ సర్వే నిర్వహించినట్లు నివేదికలో తెలిపింది. దేశంలో అబ్బాయిల కన్నా అమ్మాయిలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో మేఘాలయ, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నాయని పేర్కొంది.

కేరళలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,138 మంది అమ్మాయిలుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో 1,032 మంది అమ్మాయిలున్నారని వెల్లడించింది. 2019–20లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,021 మంది అమ్మాయిలుండగా.. 2023–24లో ఆ సంఖ్య 1,032కు పెరిగిందని పేర్కొంది. అలాగే ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,019 మంది అమ్మాయిలుండగా.. పట్టణ ప్రాంతాల్లో 1,064 మంది అమ్మాయిలున్నట్లు తెలిపింది. దేశం మొత్తం మీద 11 రాష్ట్రాల్లోనే అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉందని వెల్లడించింది.  

జాతీయ స్థాయిలోనూ పురోగతి..
దేశం మొత్తం మీద చూస్తే అబ్బాయిల సంఖ్యే ఎక్కువగా ఉన్నప్పటికీ.. అమ్మాయిల సంఖ్య గతంలో కంటే పెరిగిందని నివేదిక వెల్లడించింది. దేశంలో 2019–20లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 963 మంది అమ్మాయిలుండగా.. 2023–24లో ఆ సంఖ్య 981కి పెరిగిందని తెలిపింది. ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తోందని నివేదిక పేర్కొంది. అమ్మాయైనా, అబ్బాయైనా.. ఒక్కరు చాలనుకునే వారి సంఖ్య పెరిగిందని వెల్లడించింది. ఇక హరియాణాలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 867 మంది అమ్మాయిలు, ఢిల్లీలో 837 మంది, దాద్రా–నగర్‌–హవేలీ–డామన్‌–డయ్యూలో 818 అమ్మాయిలు మాత్రమే ఉన్నట్లు పేర్కొంది.   

#

Tags : 1

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు