Breaking News

ఇక బ్యాంకు ఖాతాకు నలుగురు నామినీలు!

Published on Sat, 04/26/2025 - 04:28

సాక్షి, అమరావతి: బ్యాంకు ఖాతాదారులు నలుగురిని నామినీలుగా నియమించుకునే అవకాశం రానుంది. ఆరి్థక ఆస్తుల నిర్వహణలో పారదర్శత తీసుకురావడంతోపాటు బ్యాంకింగ్‌ వ్యవస్థలో క్లెయిమ్‌ చేయని డిపాజిట్ల సంఖ్యను తగ్గించడం కోసం కేంద్రం ఈ మార్పు తీసుకొస్తోంది. ఇందుకోసం ఇటీవలే బ్యాంకింగ్‌ చట్టాల (సవరణ) బిల్లును పార్లమెంటు ఆమోదించింది. నాలుగు రోజుల క్రితమే ఈ సవరణపై నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. దీంతో బ్యాంకులు, మ్యూచువల్‌ ఫండ్స్, డీమ్యాట్, బీమా నామినేషన్‌ నియమాలలో త్వరలో కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి.  

ఖాతా దారులకు రెండు ఆప్షన్లు
నలుగురు నామినీల్లో ఎవరిని హక్కుదారుగా నిర్ణయించాలనేది బ్యాంకు ఖాతాదారు ఇష్టం. దీనికోసం రెండు ఆప్షన్లను కేంద్రం ప్రతిపాదించింది. మొదటి ఆప్షన్‌లో ఓ ఖాతాదారుకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉంటే అందరినీ నామినీలుగా పెట్టుకుని ఒకరి మరణా­నంతరం మరొకరిని హక్కుదారుగా పేర్కొనవచ్చు. ఉదాహరణకు తొలుత భార్య ఆమె మరణానంతరం కుమారుడు, అతని మరణానంతరం కుమార్తెలను హక్కుదారులుగా సూచించవచ్చు. 

రెండో ఆప్షన్‌లో తన ఖాతాలోని ఆస్తిని శాతాలవారీగా నలుగురికీ కేటాయించవచ్చు. ఈ మార్పు అన్ని ఖాతాలకు (మ్యూచువల్‌ ఫండ్స్, డీమ్యాట్, బీమా, బ్యాంక్‌) వర్తిస్తుంది. బ్యాంకు ఖాతాకు మాత్రమే నలుగురు నామినీలను ఎంచుకునే అవకాశం ఉంటుంది. మ్యూచువల్‌ ఫండ్స్, డీమ్యాట్, బీమా వంటి వాటికి ముగ్గురు నామినీలను నియమించే అవకాశం మాత్రమే ఉంది.

గతంలో ఒక్క నామినీకే అవకాశం  
గతంలో బ్యాంక్‌ ఖాతాకు ఒక్క నామినీని మాత్రమే పేర్కొనే అవకాశం ఉండేది. దీనివల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నట్లు చాలాకాలం నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. నామినీ మరణించినా అతని ఖాతాలోని ఆస్తులు వారసులకు బదిలీ కాకపోవడంతోపాటు రెండో నామినీ లేకపోవడం వల్ల చట్టపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. చివరికి పదేళ్ల తర్వాత ఖాతాలోని ఆస్తులు ఎవరికీ క్లెయిమ్‌ చేయకపోవడం వల్ల డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎవేర్‌నెస్‌ ఫండ్‌కి అవి జమ అయిపోతున్నాయి.  

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)