Breaking News

విద్యార్థినులకు ‘ప్రగతి’ సాయం

Published on Tue, 08/19/2025 - 05:58

సాక్షి, అమరావతి: విద్యార్థినులకు ఆర్థిక సహాయార్థం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ‘ప్రగతి స్కాలర్‌ షిప్‌’లను అందిస్తోంది. ఈ పథకం సాంకేతిక విద్యలో డిగ్రీ, డిప్లొమా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ మేరకు (ఆన్‌లైన్‌లో) అర్హత కలిగిన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు ఆహా్వనిస్తోంది. అక్టోబర్‌ 31లోగా జాతీయ స్కాలర్‌ షిప్‌ పోర్టల్‌   https:// scholarships. gov.in/  ద్వారా దరఖాస్తులు సమర్పించాలంది. ఆధార్‌ బ్యాంకు లింకు చేసిన అకౌంట్‌ను జత చేయాలని పేర్కొంది.

ఈ పథకానికి కుటుంబ వార్షిక ఆదాయం రూ.8లక్షల కంటే తక్కువ ఉన్న వారు అర్హులు. ఇలా ప్రతి కుటుంబంలో గరిష్ఠంగా ఇద్దరు బాలికల వరకు ఆర్థిక సహాయం అందించనుంది. ఏఐసీటీ ఈ ఆమోదించిన సంస్థల్లో సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న (లేటరల్‌ ఎంట్రీ అయినా) విద్యార్థినులకు ఏడాదికి రూ.50వేలు చొప్పున స్కాలర్‌షిప్‌ ఇవ్వనుంది. డిగ్రీ స్థాయిలో గరిçష్టంగా నాలుగేళ్లు ఇలా సహయాన్ని ఇస్తోంది. డిప్లొమాలో చేరిన విద్యార్థినులకు సైతం ఈ పథకాన్ని గరిష్టంగా మూడేళ్లు ఇవ్వనుంది. ఈ సహాయాన్ని ట్యూషన్‌ ఫీజులు, పుస్తకాలు, కంప్యూటర్లు, స్టేషనరీ వంటి పరికరాల ఖర్చుల నిమిత్తం ఏక మొత్తంలో అందించనుండటం విశేషం. 

అర్హులందరికీ... 
దేశంలో 23 రాష్ట్రాల్లో ఏటా 10వేల స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. వీటికి అదనంగా 13 రాష్ట్రాలు/కేంద్ర పాలిక ప్రాంతాల్లో ఎంత మంది అర్హత కలిగిన విద్యార్థినులు దరఖాస్తు చేసుకుంటే అందరికీ స్కాలర్‌షిప్‌ను మంజూరు చేయనుంది.

సమర్పించాల్సిన పత్రాలు (నకలు).. 
⇒ ఎస్‌ఎస్‌ఈ ధ్రువపత్రం 
⇒ హెచ్‌ఎస్‌సీ/12వ తరగతి (డిగ్రీ లెవల్‌ విద్యార్థినులకు) 
⇒ ఐటీఐ ధ్రువపత్రం (డిప్లొమా విద్యార్థినులకు) 
⇒ బ్యాంకు పాస్‌బుక్‌ 
⇒ కుల ధ్రువీకరణ పత్రం 
⇒ ఆధార్‌ కార్డు 
⇒ స్టడీ ధ్రువపత్రం 
⇒ వార్షిక ఆదాయ ధ్రువపత్రం 
⇒ తల్లిదండ్రుల డిక్లరేషన్‌ 
⇒ బ్యాంకు మ్యాన్‌డేట్‌ ఫారమ్‌ 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)