Breaking News

పీజీ మెడికల్‌ కన్వీనర్‌ కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్‌

Published on Thu, 10/15/2026 - 03:44

సాక్షి, అమరావతి :  2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ మెడికల్‌ కన్వీనర్‌ కోటా ప్రవేశాలకు బుధవారం ఆరోగ్య విశ్వ­విద్యాలయం నోటిఫికేషన్‌ ఇచ్చింది. నీట్‌ పీజీ–2026లో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణను బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభించింది. ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు విధించారు. ఆలస్యరుసుంతో దరఖాస్తుకు 22వ తేదీ వరకు అవకాశం కల్పిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల ఎంబీబీఎస్‌ ఇంటర్న్‌షిప్‌ కటాఫ్‌ తేదీని ఈ ఏడాది సెప్టెంబర్‌ 30గా ఖరారు చేశారు. 

దరఖాస్తు సమయంలో ఏపీ పరిధిలో ఎంబీబీఎస్‌ చదివిన ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.7 వేలు, ఎస్సీ, ఎస్టీలైతే రూ.6 వేలు చొప్పున, ఏపీ వెలుపల ఎంబీబీఎస్‌ చదివిన బీసీ, ఓసీ అభ్యర్థులు రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీలైతే రూ.9 వేలు చొప్పున రుసుం చెల్లించాలి. దేశం వెలుపల ఎంబీబీఎస్‌ చదివిన బీసీ, ఓసీలు రూ.14 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.13 వేలు రుసుం చెల్లించాలి. గడువు ముగిశాక దరఖాస్తు చేసుకునేవారు నిర్దేశించిన రుసుంకు అదనంగా రూ. 20 వేలు సమర్పించాల్సి ఉంటుంది. సాంకేతిక సమస్యలు తలెత్తినట్లైతే 90007 80707, 80082 50842 నెంబర్లను సంప్రదించాలి. 

ఎంబీబీఎస్‌ వెబ్‌ఆప్షన్‌ల నమోదుకు అవకాశం
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లలో ప్రవేశాల­కు మూడో విడ­త కౌన్సెలింగ్‌కు వెబ్‌­ఆప్షన్‌లు నమోదు చేసుకో­వాలని విద్యార్థులకు బుధ­వారం ఆరోగ్య విశ్వవిద్యాలయం సూచించింది. ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకూ గడువు విధించింది.   

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)