Breaking News

ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

Published on Sat, 08/10/2024 - 05:14

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య, దంత కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో కన్వినర్‌ కోటా ప్రవేశాల కోసం విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. శనివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి 16 సాయంత్రం ఆరు గంటల వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. https://apuhs&ugadmissions.aptonline.­in లో దరఖా­స్తులు సమర్పించాలి. 

ఓసీ, బీసీ విద్యార్థులు రూ.2,950, ఎస్సీ, ఎస్టీలు రూ.2,360 దరఖాస్తు రుసుం చెల్లించాలి. నియమ, నిబంధనలకు సంబంధించి సందేహాల నివృత్తికి 8978780501, 7997710168 నంబర్లను, రుసుం చెల్లింపుల్లో సాంకేతిక సమస్యలకు 9000780707 నంబర్‌ను సంప్రదించాలని వర్సిటీ రిజి్రస్టార్‌ డాక్టర్‌ రాధికారెడ్డి తెలిపారు. విద్యార్థుల దరఖాస్తుల పరిశీలన అనంతరం మెరిట్‌ జాబితాను విశ్వవిద్యాలయం రూపొందిస్తుంది. 

తుది మెరిట్‌ జాబితా ప్రకటించాక కన్వినర్‌ కోటాలో అన్ని దశలకు కలిపి ఒకేసారి వెబ్‌ఆప్షన్‌ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. అనంతరం వివిధ దశలుగా కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు. కాగా, ఈ ఏడాది రాష్ట్రం నుంచి 43,788 మంది నీట్‌ యూజీ–2024లో అర్హత సాధించారు.    

ఉస్మానియా కోటా రద్దు 
జీవో 513 ప్రకారం.. విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) కోటాను రద్దు చేసినట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. గత విద్యా సంవత్సరం వరకు ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ), ఓయూ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీయూ) విద్యార్థులకు 42:36:22 నిష్పత్తిలో ఎంబీబీఎస్‌ సీట్లను కేటాయిస్తూ వచ్చారు. ఈ ఏడాది నుంచి 36 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకు కాకుండా ఏపీ విద్యార్థులకే కేటాయించనున్నారు. మెరిట్‌ ఆధారంగా ఏయూ, ఎస్వీయూ విద్యార్థులతో సీట్లను భర్తీ చేయనున్నారు.    

అప్‌లోడ్‌ చేయాల్సిన ధ్రువపత్రాలు 
4 నీట్‌ యూజీ– 2024 ర్యాంక్‌ కార్డ్‌  4 పుట్టిన తేదీ ధ్రువీకరణ (పదో తరగతి మార్కుల మెమో) 4 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు 4 ఇంటర్మిడియెట్‌ స్టడీ, ఉత్తీర్ణత సర్టిఫికెట్లు 4 విద్యార్థి తాజా పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, సంతకం 4 ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ (ఇంటర్‌/10+2)  4 కుల ధ్రువీకరణ  4  ఆధార్‌ కార్డు 4  దివ్యాంగ ధ్రువీకరణ పత్రం

 
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)