Breaking News

ఓటుకే భద్రత లేదు!

Published on Sun, 10/06/2024 - 05:44

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తంతు ప్రహసనంలా మారింది. ఈ జాబితాలో పేరు ఉండాలంటే ప్రతిసారి ఓటు హక్కు నమోదు చేసుకోవాలని చెబుతుండడం అందరికీ ఇబ్బంది అవుతోంది. 

వచ్చే ఏడాది మార్చి నెలలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తాజాగా షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా, గతంలో ఓటుహక్కు వినియోగించుకున్న పట్టభద్రుల జాబితా లేదని, మళ్లీ కొత్తగా నమోదుకు చర్యలు చేపట్టింది.
  
కొరిటెపాడు(గుంటూరు):  ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని అర్హులైన పట్టభద్రులంతా సెప్టెంబర్‌ 30వ తేదీ నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో తమ ఓటు నమోదు చేసుకోవాల్సి ఉంది. ఈ ఎన్నికలు జరిగే ప్రతిసారీ ఇలా ఓటు హక్కు నమోదు చేసుకోవాలంటే ఎలా అంటూ ఓటర్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 

రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు లేకపోయినా.. పట్టభద్రులైతే చాలు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్సీకి పోటీ చేసే అభ్యర్థికి తొలి, ద్వితీయ, తృతీయ ప్రాధాన్య ఓట్ల ద్వారా కనీసం 50 శాతంపై అనుకూలంగా పడితేనే విజయం వరిస్తుంది. 

3 లక్షలు దాటే అవకాశం 
ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 2019 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,48,799 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో కేవలం 1,14,325 (45.79 శాతం) మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మార్చి 2025లో జరిగే పట్టభద్రుల ఎన్నికలకు సుమారు 3 లక్షల మందికిపైగా నమోదు చేసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 

నమోదు నిబంధనలు ఇవీ.. 
» ఈ ఎన్నికలు జరిగే నియోజకవర్గాల పరిధిలో ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవారు మళ్లీ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి. 
» ఫాం 18 వినియోగించుకుని దరఖాస్తు అందించాలి. 
» సెపె్టంబర్‌ 30 నుంచి నవంబర్‌ 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో నమోదుకు అవకాశం ఉంది.  
»  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే.. అధికారులు నేరుగా ఇంటి చిరునామాకు వచ్చి ధ్రువపత్రాలను పరిశీలిస్తారు.  
»  ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి పరిశీలనా ఉండదు. 
»  ఫాం 18లో వివరాలను తొలుత పూరించాలి. ఆధార్‌ కార్డు, డిగ్రీ సర్టిఫికెట్‌ నకలు, నివాస ధ్రువపత్రం సెట్‌గా చేసి మండల తహసీల్దార్, గ్రామ సచివాలయం, మీ సేవా కేంద్రాల్లో అందించవచ్చు.  

హక్కులను హరించినట్టే.. 
పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారీ ఓటు నమోదు చేయించుకోమనడం సరికాదు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు ఇవ్వడమంటే ప్రజల హక్కులను హరించినట్లే. గతంలో పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు వేసిన వారిని కొత్తగా నమోదు నుంచి మినహాయించాలి.  – తూము వెంకటేశ్వరరెడ్డి, బీకాం, గుంటూరు  

పునరాలోచన అవసరం 
పట్టభద్రుల ఓటు నమోదును గ్రామ సచివాలయాల్లో చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఓటు నమోదు పట్టభద్రులను అనుమానించడమేనని భావిస్తున్నాం. దీనిపై ఎన్నికల కమిషన్‌ పునరాలోచన చేయాలి.
– ఎం.నరేంద్రరెడ్డి, బీఏ, గుంటూరు   

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)