Breaking News

కొత్త ప్రాజెక్ట్‌లు కరువు.. రీసెర్చ్‌ అడ్మిషన్లు లేవు

Published on Thu, 11/20/2025 - 05:01

అనంతపురం: చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. పీహెచ్‌డీ కోర్సుల్లో నేరుగా అడ్మిషన్లకు నిర్వహించే ఏపీ సెట్‌ (స్టేట్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌) నిర్వహించడంలేదు. దేశవ్యాప్తంగా నెట్‌­ను క్రమంగా తప్పకుండా నిర్వహిస్తున్నా మన రాష్ట్రంలో మాత్రం నేటికీ దాని ఊసే లేకుండా పోయింది.  

తిరోగమనంలో విద్యారంగం 
చంద్రబాబు సర్కార్‌ అధికారం చేపట్టిన నాటి నుంచి విద్యారంగం తిరోగమన దిశలో పయనిస్తోంది. ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశాలకు సంబంధించి 2025–26 విద్యా సంవత్సరంలో మునుపెన్నడూ లేని రీతిలో తీవ్ర జాప్యం జరుగుతోంది. విద్యార్థు జీవితాలతో చెలగాటం ఆడుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఏపీ సెట్‌ నిర్వహణ విషయంలోనూ అదే తీరును అవలంభిస్తుండటంపై విద్యార్థులు, విద్యావేత్తల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

ప్రభుత్వం నోటిఫికేషన్‌ను తాత్సారం చేయడంతో అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారు. వర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్‌ పోస్టులకు ఏపీ సెట్‌ అర్హత సాధించాల్సి ఉంటుంది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీకి, అలాగే డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించే రిక్రూట్‌మెంట్‌ పరీక్షలకు సెట్‌ (స్టేట్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌), నెట్‌ (నేషనల్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌) ఇందులో ఏదో ఒకటి, లేదా పీహెచ్‌డీ చేసిన వారు అర్హులు. 

ఏపీ సెట్‌కు పీజీ పూర్తి చేసిన వారు, లేదా పీజీ చివరి సంవత్సరం చదువుతున్న వారు అర్హులు. ఏటా వేలాది మంది రాసే ఈ పరీక్షల్లో అప్పుడే ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల నుంచి వివిధ వృత్తుల్లో ఉద్యోగాలు చేస్తూ ఏపీ సెట్‌కు పోటీపడే అభ్యర్థులు కూడా ఉంటున్నారు. 

చివరిసారిగా గతేడాది ఏప్రిల్‌లో.. 
ఏపీ సెట్‌ను గతేడాది ఏప్రిల్‌ నెలలో నిర్వహించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సెట్‌ను నిర్వహించాల్సి ఉంది. అయినప్పటికీ ఇప్పటిదాకా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సెట్‌ నిర్వహించకపోవడంతో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఇంటర్నల్‌ నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. నెట్, సెట్‌ అర్హత సాధించిన వారికి నేరుగా ఇంటర్నల్‌ నోటిఫికేషన్‌ ద్వారా పీహెడీ అడ్మిషన్‌ కల్పించే వెసులుబాటు కల్పించారు. 

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో నూతన రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌ల ఊసే లేకుండా పోయింది.  డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కింద గతంలో ఇబ్బడి ముబ్బడిగా ప్రాజెక్ట్‌లు వచ్చేవి. ప్రస్తుతం రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌లు లేక డిపార్ట్‌మెంట్లు బోసిపోయాయి. కొత్త ప్రాజెక్ట్‌లు వస్తే వాటి కింద అడ్మిషన్లు కల్పించి పీహెచ్‌డీ డిగ్రీ అందించవచ్చు. వర్సిటీకి బోధన, పరిశోధన, సామాజిక బాధ్యత ముఖ్యమైన విధి. బోధించడానికి ఇక్కడ ప్రొఫెసర్లు లేరు. పరిశోధనకు కొత్త ప్రాజెక్ట్‌లు లేవు. 

గతంలో బోటనీ, బయోటెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, పాలిమర్‌ సైన్సెస్, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో అద్భుతమైన రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌లు నిర్వహించిన ఘనత ఉంది. బోటనీలో 32 వేల స్పెసిమెన్లు భద్రపరిచారు. వాటిలో ఇది వరకు ఉన్న ప్రాజెక్ట్‌లు మినహా ఏడాదిన్నరలో ఒక్క రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌ రాలేదు. 

రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌లు కావాలని దరఖాస్తు చేసినా.. డిల్లీ స్థాయికి వెళ్లి ప్రాజెక్ట్‌లు తెచ్చేంత చొరవ ఎవరూ తీసుకోవడం లేదు. రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌లు, పేటెంట్లతో తమకేం సంబంధం లేనట్లు వర్సిటీ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

డిసెంబర్‌లోనే యూజీసీ నెట్‌ 
రాష్ట్రంలో సెట్‌ తరహాలోనే యూజీసీ నెట్‌ (నేషనల్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌)ను నిర్వహిస్తోంది. యూజీసీ ఏడాదిలో రెండు దఫాలు, జూన్, డిసెంబర్‌లో క్రమం తప్పకుండా చేపడుతోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించనుంది. యూజీసీ నెట్‌ను దేశవ్యాప్తంగా ఏటా 5 నుంచి 7 లక్షల మంది అభ్యర్థులు రాస్తారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)