Breaking News

No Confidence Motion: అస్త్రశ్రస్తాలతో సిద్ధమైన విపక్షాలు 

Published on Thu, 01/30/2025 - 07:39

సాక్షి, హైదరాబాద్‌: దాదాపు ఏడాది కాలంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో గురువారం జరగనున్న జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశాన్ని అన్ని పార్టీలూ సవాల్‌గా తీసుకుంటున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన బడ్జెట్‌పై ప్రత్యేక సమావేశం, ప్రజా సమస్యలపై సాధారణ సమా వేశం రెండూ ఒకేరోజు నిర్వహిస్తున్నారు. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం అంశం ఇప్పటి వరకు హాట్‌టాపిక్‌గా ఉన్నప్పటికీ, దాని సాధ్యాసాధ్యాలు అంచనా వేసిన పార్టీలు ప్రస్తుత సమావేశంలో ప్రజా సమస్యలనే ప్రముఖంగా ప్రస్తావించాలని తమ కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశాయి. 

విపక్షాలు సంధించే ప్రశ్నలను, ఎదురయ్యే  పరిస్థితుల్ని  ఎదుర్కొనేందుకు తగిన యుక్తి ప్రదర్శించాల్సిందిగా కాంగ్రెస్‌ తమ పార్టీ కార్పొరేటర్లకు వివరించినట్లు తెలిసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు బుధవారం మేయర్, కొందరు కార్పొరేటర్లతో మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్‌ఎంసీ పరిధిలోని పార్టీ ఎమ్మెల్సీలు, కొందరు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కౌన్సిల్‌  సమావేశానికి బయలుదేరేముందు గురువారం ఉదయం మరోసారి కాంగ్రెస్‌ కార్పొరేటర్లు మంత్రి పొన్నంతో ఆయన నివాసంలో సమావేశం కానున్నట్లు సమాచారం. మంగళవారం  బీజేపీ కార్పొరేటర్లకు జాతీయ, రాష్ట్ర నేతలు దిశానిర్దేశం చేశారు. 

నిధుల కోసం.. 
పార్టీలకతీతంగా కార్పొరేటర్లు తమ ఫండ్‌ కోసం పట్టుబట్టనున్నారు. ఎన్నికలకు మిగిలింది ఏడాది కాలమే. తిరిగి ఓట్లకోసం ప్రజల వద్దకు ఎలా వెళ్లాలని వారిలో వారే చర్చించుకుంటున్నారు. మేయర్‌ కేవలం స్టాండింగ్‌ కమిటీ సభ్యులకు మాత్రం రూ.25 కోట్ల ఫండ్‌ ఇవ్వాలని కమిషనర్‌ను కోరడం కార్పొరేటర్లకు పుండుపై కారం చల్లినట్లుగా మారింది. ఈ నేపథ్యంలో సభ సజావుగా సాగుతుందా.. లేక  ఎప్పటిలాగే రసాభాసగానే ముగుస్తుందా? అన్నది కొద్ది గంటల్లో వెల్లడి కానుంది. మొత్తానికి వాతావరణం మాత్రం వాడీవేడిగానే ఉంది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.  

అడ్డగోలు బడ్జెట్‌ 
బడ్జెట్‌ అడ్డగోలుగా ఉందని  నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి.  నగర ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులతో వారికి మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని ఎండగట్టనున్నట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారుల అనుభవ రాహిత్యంతో బడ్జెట్‌ రూపకల్పనే సవ్యంగా లేదని అవి విమర్శిస్తున్నాయి. స్టాండింగ్‌ కమిటీలో బడ్జెట్‌ తొలుత ఆమోదం పొందకపోవడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాయి.  రూ.8 వేల కోట్లకుపైగా ఉన్న బడ్జెట్‌పై సమగ్ర చర్చ జరగాలని డిమాండ్‌ చేయనున్నాయి. సభలో మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వకుంటే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ తమ హయాంలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు కనిపించడం లేదని, తాము పూర్తి చేసిన పనులను కాంగ్రెస్‌ గొప్పగా చెప్పుకుంటోందని గళమెత్తనుంది. ఇక కాంగ్రెస్‌.. తమ ప్రభుత్వంలోని   సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పనుంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వ హయాంలోనే జీహెచ్‌ఎంసీకి రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించడాన్ని ప్రస్తావించనుంది.  

కమిషనర్‌కు తొలి సమావేశం  
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇలంబర్తికి పాలకమండలి తొలి సమావేశం ఇది. కొందరు హెచ్‌ఓడీలు కూడా కొత్త. సభ్యులనుంచి ఎదురయ్యే ప్రశ్నలకు ఎలా స్పందిస్తారో, ఎలాంటి సమాధానాలిస్తారో సభలో వెల్లడి కానుంది. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారితో కాంగ్రెస్‌ కార్పొరేటర్ల బలం 24 మందికి పెరిగినప్పటికీ, వారిలో ఎందరు పార్టీకి అనుకూలంగా గళమెత్తనున్నారో తెలియని పరిస్థితి. బహుశా, ఈ విషయం తెలిసే పార్టీ వారంతా సభలో  కలిసికట్టుగా వైరి పక్షాలను ఎదుర్కొనాలని  మంత్రి పొన్నం వారికి సూచించారు. సభ అధ్యక్షత వహించే మేయర్‌కు పరిస్థితి క్లిష్టంగానే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

గొడవలతోనే సరిపెడతారా.. సమస్యలు పరిష్కరిస్తారా? 
నగరంలో పలు సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. రాత్రుళ్లు వీధి దీపాలు వెలగడం లేదని నెలల తరబడిగా ప్రజలు మొత్తుకుంటున్నా పట్టించుకున్న దిక్కు లేదు. సమావేశంలో వీటిని ప్రస్తావిస్తారా లేదా అని ప్రజలు ప్రశి్నస్తున్నారు. దిగువ సమస్యలను తీర్చాలంటున్నారు. 

చెత్త సమస్యలు ఎప్పటికీ తీరడం లేదు. ప్రతిరోజూ స్వచ్ఛ ఆటో కారి్మకులు ఇంటింటికీ వెళ్లడం లేదు. దీనిపై ఎవరిని సంప్రదించాలో అర్థం కాక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.  

చాలా ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా మారాయి. తిరిగి సీఆర్‌ఎంపీ ఏజెన్సీలకే కట్టబెట్టాలనే యోచనతో కాబోలు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇంజినీర్లు పనులు చేయడం లేదు. కాలనీలతో పాటు ప్రధాన రోడ్లలోనూ గుంతలు కనిపిస్తున్నాయి.  

ప్రజలకు బర్త్, డెత్‌సర్టిఫికెట్ల కోసం అగచాట్లు తప్పడం లేదు. పుడ్‌ సేఫ్టీ లేక ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నా, లక్షల బిల్లులు చెల్లిస్తున్నా, ప్రాణాలు పోతున్నా జీహెచ్‌ఎంసీ నిద్ర పోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నా, హోటళ్ల తనిఖీల్లో లోపాలు బట్టబయలవుతున్నా ఎలాంటి మార్పూ లేదు.  

 నాలాల కోసం ఏటా వందల కోట్లు ఖర్చు పెడుతున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి 

అక్రమ భవనాల నిర్మాణాలకు హద్దూపద్దూ లేకుండా వెలుస్తున్నాయి. దాంతో పరిసరాల్లోని ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కళ్లెదుట నిలువెత్తు అక్రమాలు కనిపిస్తున్నా చర్యల్లేకుండాపోయాయి.    

ఇలా వివిధ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు మొత్తుకుంటున్నా, ప్రతిసారీ అధికార, ప్రతిపక్ష సభ్యుల గందరగోళాలతోనే ముగిస్తున్నారు. ఈసారైనా  చర్చించి పరిష్కరిస్తారా? అని ప్రజలు ప్రశి్నస్తున్నారు.  

 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)